Bypolls: కొనసాగుతున్న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు.. లీడ్‌లో ఇండియా కూటమి అభ్యర్థులు
ABN, Publish Date - Jul 13 , 2024 | 11:45 AM
లోక్ సభ ఎన్నికల సమరం ముగిసినా.. ప్రస్తుతం మరోసారి ఎన్డీయే, ఇండియా కూటమి నేతలు పోటీ పడుతున్నారు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల(Assembly Bypolls) ఫలితాలు మధ్యాహ్నంకల్లా విడుదల కానున్నాయి.
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల సమరం ముగిసినా.. ప్రస్తుతం మరోసారి ఎన్డీయే, ఇండియా కూటమి నేతలు పోటీ పడుతున్నారు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల(Assembly Bypolls) ఫలితాలు మధ్యాహ్నంకల్లా విడుదల కానున్నాయి.
లోక్ సభ ఎన్నికల తరువాత రెండు కూటమిల తొలి పోటీ ఇదే కావడం విశేషం. వెస్ట్ బెంగాల్‌లోని 4, హిమాచల్ ప్రదేశ్‌లోని 3, ఉత్తరాఖండ్‌లోని 2, పంజాబ్, మధ్యప్రదేశ్, బిహార్, తమిళనాడులోని ఒక్కో స్థానానికి జులై 10న ఉప ఎన్నిక జరిగింది.
శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ రాష్ట్రాల్లో నాలుగింటిలో ఇండియా కూటమి అధికారంలో ఉంది. 3 రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి ఉంది.
ఎన్నికల సంఘం (EC) వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. ఉదయం 11 గంటలకు11 స్థానాల్లో ఇండియా కూటమికి చెందిన కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, డీఎంకే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, బిహార్‌లోని రూపౌలీలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) భాగస్వామి జేడీయూ ఆధిక్యతను ప్రదర్శిస్తోంది.
For Latest News and National News click here
Updated Date - Jul 13 , 2024 | 11:45 AM