ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Assembly by-polls: ఉపఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ

ABN, Publish Date - Jun 14 , 2024 | 02:48 PM

లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుకున్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు సిద్ధమవుతోంది. నాలుగు స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జూలై 10న ఈ సీట్లలో పోలింగ్ జరుగనుంది.

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుకున్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMS) పశ్చిమబెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఉప ఎన్నికలకు (Assembly by-polls) సిద్ధమవుతోంది. నాలుగు స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జూలై 10న ఈ సీట్లలో పోలింగ్ జరుగనుంది. రాయగంజ్ నియోజకవర్గం నుంచి కృష్ణ కల్యాణి, రణఘాట్-దక్షిణ్ నుంచి ముకుట్ మణి అధికారి, మాణిక్‌తలా నుంచి సుప్తి పాండే, బాగ్దా నుంచి మధుపర్న ఠాకూర్‌లను పార్టీ అభ్యర్థులుగా టీఎంసీ ప్రకటించింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీ రాజీనామా? ఎందుకంటే..!


ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక

ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల తేదీలను ఈనెల 10న ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జూలై 10న ఈ సీట్లకు ఎన్నికలు జరుగనుండగా జూలై 13న ఫలితాలు వెలువడతాయి. బీహార్‌, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్‌లో ఒక్కో స్థానానికి, ఉత్తరాఖండ్‌లో 2 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్‌లో 3 స్థానాలు, పశ్చిమబెంగాల్‌లో 4 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 21వ తేదీతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండగా, నామినేషన్ల ఉపసంహరణ గడువు జూన్ 26తో ముగుస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల రాజీనామాలు, మృతి కారణంగా ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

For More National News and Telugu News..

Updated Date - Jun 14 , 2024 | 02:48 PM

Advertising
Advertising