Assembly Polls: మధ్యాహ్నానికి మహారాష్ట్రలో 45, జార్ఖాండ్‌లో 61 శాతం పోలింగ్
ABN, Publish Date - Nov 20 , 2024 | 05:27 PM
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా, జార్ఖాండ్‌లో రెండో విడతగా 38 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడతాయి.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) పోలింగ్ బుధవారం మందకొడిగా మొదలై క్రమంగా పుంజుకుంది, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతానికి 45.53 శాతం పోలింగ్ నమోదైంది. ఇదే సమయానికి జార్ఖాండ్ (Jharkhand)లో రెండవది, చివరిదైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 61.47 శాతం నమోదైనట్టు ఈసీఐ తెలిపింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా, జార్ఖాండ్‌లో రెండో విడతగా 38 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడతాయి.
UP Bypolls: ఈసీ కొరడా...ఏడుగురు పోలీసుల సస్పెండ్
కాగా, మహారాష్ట్రలోని నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకూ అత్యధికంగా 62.99 శాతం పోలింగ్ నమోదు కాగా, థానే జిల్లాల్లో అత్పల్పంగా 38.94 శాతం పోలింగ్ నమోదైంది. ముంబై సిటీలో 39.34 శాతం పోలింగ్ జరిగింది. ఈసీఐ సమాచారం ప్రకారం, ముంబై సబర్బన్‌లో ఓటింగ్ శాతం 40.89, నాగపూర్‌లో 44.45, ఔరంగాబాద్‌లో 47.05, పుణెలో 41.70, నాసిక్‌లో 46.86, సతారాలో 49.82, ధులెలో 47.62, పాల్ఘర్‌లో 46.82, రత్నగిరిలో 50.04, నాందేడ్‌లో 42.87, లాతూరులో 48.35 శాతం పోలింగ్ నమోదైంది.
జార్ఖాండ్‌లో...
జార్ఖాండ్‌లో రెండో విడతగా మధ్యాహ్నం 3 గంటల వరకూ 61.47 శాతం పోలింగ్ నమోదు కాగా, పకూరు జిల్లాలో అత్యధికంగా 69.31, ధన్‌బాద్‌లో కనిష్టంగా 56.32 శాతం పోలిగ్ నమోదైంది. డోయోగఢ్‌లో 64.55, డుంకాలో 64.79, గిర్డిలో 60.57, హజారీబాగ్‌లో 58.16, జంతారాలో 68.24, రామ్‌గఢ్‌లో 66.02, రాంచీలో 65.84, సాహెబ్‌గంజ్‌లో 60.08 శాతం పోలింగ్ నమోదైంది.
మహారాష్ట్రలోని నాందేడ్ పార్లమెంటరీ నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటల వరకూ 41.58 శాతం పోలింగ్ నమోదైంది. ఏడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతుండగా, ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో మధ్యాహ్నం వరకూ 47 శాతం, కేరళలోని పాలక్కాడ్‌లో 54.11 శాతం పోలింగ్ నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. పంజాబ్ ఉపఎన్నికల్లో భాగంగా గిద్దెర్‌బహలో 65.80, డేరాబాబా నానక్‌లో 52.20, బర్నాలాలో 40, చబ్బెవాల్‌లో 40.25 శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉపఎన్నికల్లో మీరాపూర్‌లో 49.06, మఝ్వాన్‌లో 43.64, ఖైర్‌లో 39.86, ఫుల్పూర్‌లో 36.58, కుందర్కిలో 50.03, కర్హాల్‌లో 44.70, కతెహారిలో 49.29, ఘజియాబాద్‌లో 27.44 శాంత, శిష్‌మౌలో 40.29 శాతం పోలింగ్ నమోదైంది.
ఇవి కూడా చదవండి...
Former Minister: నటుడు విజయ్ పార్టీతో పొత్తుకోసం ఇంకా చర్చించలేదు
TVK: టీవీకే పార్టీపై ఇంటెలిజెన్స్ నిఘా..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Nov 20 , 2024 | 05:28 PM