ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

August 15: ఢిల్లీ ఎల్జీకి సీఎం కేజ్రీవాల్ లేఖ

ABN, Publish Date - Aug 07 , 2024 | 02:37 PM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ వ్యవహరంలో ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. నాటి నుంచి ఆయన తీహాడ్ జైలుల్లోనే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ.. తాను ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాని సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Delhi CM Arvind Kejriwal

న్యూఢిల్లీ, ఆగస్ట్ 07: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 వేడుకల్లో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మంత్రి అతిషికి అనుమతి ఇవ్వాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి కె సక్సెనాను సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. అందుకోసం ఢిల్లీ ఎల్జీ వికె సక్సెనాకు బుధవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రతి ఏడాది ఆగస్ట్ 15వ తేదీన ఛత్రసాల్ స్టేడియం వేదికగా కేజ్రీవాల్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది.

Also Read: ఆస్పత్రి పాలైన రెజ్లర్ వినేశ్‌ ఫోగట్..|

Also Read: Bangladesh violence: హిందూవులను కాపాడండి.. సద్గురు జగ్గీ వాసుదేవన్ విజ్ఞప్తి


అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ వ్యవహరంలో ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. నాటి నుంచి ఆయన తీహాడ్ జైలుల్లోనే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ.. తాను ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాని సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారం పూర్తికాగానే సీఎం కేజ్రీవాల్ మళ్లీ జైల్లోకి వెళ్లిపోయారు. నాటి నుంచి ఆయన తీహాడ్ జైల్లోనే ఉన్నారు.

Also Read: Olympics 2024: వినేశ్‌పై అనర్హత వేటు.. స్పందించిన ప్రధాని మోదీ

Also Read: National Commission for Women: చైర్మన్ పదవికి రేఖా శర్మ రాజీనామా


మరోవైపు ఇదే కేసులో ఇటీవల స్థానిక కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఆయన విడులవుతారని అంతా భావించారు. కానీ ఇదే కేసులో ఆయన్ని సీబీఐ సైతం అరెస్ట్ చేసింది. దీంతో బెయిల్ వచ్చినా.. బయటకు రాలేని పరిస్థితిలో అరవింద్ కేజ్రీవాల్ జైల్‌లోనే ఉండిపోయారు. బెయిల్ కోసం ఆయన ప్రస్తుతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకు బెయిల్ రాని పరిస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో ఆగస్ట్ 15వ తేదీ జెండా వందన కార్యక్రమం ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సీఎం కేజ్రీవాల్ ప్రతీ ఏటా హాజరవుతు వస్తున్నారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఇక ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సైతం తీహాడ్ జైల్లోనే ఉన్నారు. ఆయన సైతం ఇదే కేసులో అరెస్టయ్యారు.

Also Read: Bangladesh violence: ఢాకా నుంచి తిరిగొచ్చిన 205 మంది భారతీయులు

Also Read: Bangladesh: హసీనాను అప్పగించండి.. భారత్‌కు బంగ్లాదేశ్ డిమాండ్


అలాంటి పరిస్థితుల్లో మరో వారం రోజుల్లో జెండా పండగ వేడుకల్లో ఎవరు పాల్గొంటారంటూ ఓ చర్చ సైతం మొదలైంది. ఆ క్రమంలో మంత్రి అతిషి పేరును పార్టీలోని నేతలు తెరపైకి తీసుకు వచ్చినట్లు సమాచారం. అదీకాక ప్రభుత్వ పరంగా ఏమైనా నిర్ణయాలు వెల్లడించాల్సి ఉన్నా.. మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరగాలన్నా అతిషి ముందుంటారనే విషయం అందరకి తెలిసిందే. దీంతో స్వాతంత్ర్య దినోత్సవ వేళ.. త్రివర్ణ పతాకం ఎగుర వేసే బాధ్యతలు ఆమెకు అప్పగించాలని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మరి దీనిపై ఢిల్లీ ఎల్జీ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎదురు చూస్తుంది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 07 , 2024 | 02:41 PM

Advertising
Advertising
<