Ayodhya: బీజేపీపై మహువా మొయిత్రా వ్యంగ్యాస్త్రాలు
ABN, Publish Date - Jul 19 , 2024 | 05:30 PM
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా మరోసారి బీజేపీ లక్ష్యంగా చేసుకొని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీ ఓటమిపై ఆమె తనదైన శైలిలో స్పందించారు.
కోల్‌కతా, జులై 19: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా మరోసారి బీజేపీ లక్ష్యంగా చేసుకొని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీ ఓటమిపై ఆమె తనదైన శైలిలో స్పందించారు. ఆ క్రమంలో ప్రముఖ రచయిత, కామెడియన్ వరుణ్ గ్రోవర్.. తన కామెడీ షోలో చేసిన వ్యాఖ్యల గల ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో ఆమె పోస్ట్ చేశారు. మా అందరినీ చివరిగా నవ్వించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలంటూ ఆమె తన పోస్ట్‌లో కామెంట్‌ను జత చేశారు. అయితే వరుణ్ గ్రోవర్ వీడియో.. అయోధ్యలో బీజేపీ ఓటమిని ఎగతాళి చేసినట్లుగా వినిపిస్తోందని ఈ సందర్భంగా ఎంపీ మహువా మొయిత్రా వ్యాఖ్యానించారు. నేను ఇప్పుడు కామెడీ చేయాల్సిన అవసరం లేదు.
Also Read: Microsoft: మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిన సేవలు..!
రానున్న ఐదేళ్లపాటు నేను ‘ అయోధ్యలో ఓడిపోవడం చూసి నవ్వుకోగలను. తెల్లవారుజామున 2 గంటలకు నిద్ర లేవగానే అయోధ్య గురించి తలచుకుని కనీసం అరగంట అయినా నవ్వుకుంటాను. నాకు పిచ్చి పట్టిందా? అని నా పిల్లులు ఆశ్చర్య పోతుంటాయి. 'అయోధ్యలో ఓడిపోయామని నేను వాటికి చెపుతానని సదరు వీడియోలో గ్రోవర్ పేర్కొన్నారు.
Also Read: New Delhi: విదేశీ పర్యాటకులను వెంబడించిన బాలికలు.. ఎందుకోసమంటే..
ఈ ఏడాది జనవరిలో అయోధ్యలో రామమందిరంలో బాల రాముని విగ్రహాన్ని ప్రతిష్టాంచారు. ఎన్నికల్లో గెలుపు కోసం రామ మందిరంలో బాల రాముడి ప్రతిష్టకు బీజేపీ తెర తీసిందంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫైజాబాద్ లోక్‌సభ స్థానం నుంచి సమాజవాదీ పార్టీ ఎంపీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్.. తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి లులూ సింగ్‌పై ఘన విజయం సాధించారు. ఈ ఫైజాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో అయోద్య ఉంది. దీంతో సదరు నియోజకవర్గ ప్రజలు బీజేపీకి సరైన గుణపాఠం చెప్పారంటూ ఇప్పటికే ఇండియా కూటమిలోని పలు పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో మహువా మొయిత్రా సైతం ఇదే తరహాలో వ్యంగ్యంగా విమర్శించింది.
Also Read: Visakhapatnam: పిల్లల అల్లరి మాన్పించే క్రమంలో మృత్యు ఒడిలోకి ‘తండ్రి’
అయితే ఈ వీడియోను టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా రెండోసారి షేర్ చేశారు.మరోవైపు సమాజవాదీ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తాను రాముడి నిజమైన అనుచరుడినని తెలిపారు. అయితే ఈ ప్రాంతం నుంచి ఎంపీగా గెలుపొందడం తాను పెద్ద విజయంగా భావిస్తానన్నారు. ఆ క్రమంలో ఆయోధ్య ఓటర్లకు అవదేశ్ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 19 , 2024 | 05:31 PM