Fake birth certificate case: ఆజంఖాన్‌కు ఉపశమనం, ఏడేళ్ల జైలుశిక్షపై కోర్టు స్టే..
ABN, Publish Date - May 24 , 2024 | 04:19 PM
సమాజ్ మాజీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజంఖాన్‌కు నకిలీ బర్త్ సర్టిఫెకెట్ కేసులో ఉపశమనం లభించింది. ఈ కేసులో ఆయనకు పడిన ఏడేళ్ల జైలు శిక్షపై అలహాబాద్ హైకోర్టు శుక్రవారంనాడు 'స్టే' ఇచ్చింది.
లక్నో: సమాజ్ మాజీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజంఖాన్ (Azam Khan)కు నకిలీ బర్త్ సర్టిఫెకెట్ (Fake Birth Certificate) కేసులో ఉపశమనం లభించింది. ఈ కేసులో ఆయనకు పడిన ఏడేళ్ల జైలు శిక్షపై అలహాబాద్ హైకోర్టు శుక్రవారంనాడు 'స్టే' ఇచ్చింది. అయితే, ఇదే కేసులో జైలుశిక్ష పడిన ఆయన భార్య తాంజిన్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా ఆజంకు విధించిన శిక్షపై 'స్టే' ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
ఆజంఖాన్, ఆయన భార్య, కుమారుడు ముగ్గురికి బెయిలు మంజూరైనందనీ, అయితే ఆజంఖాన్‌కు పడిన జైలుశిక్షపై కోర్టు 'స్టే' ఇచ్చినప్పటికీ తక్కిన ఇద్దరికీ 'స్టే' మంజూరు చేయలేదని ఖాన్ తరఫు న్యాయవాది శరద్ శర్మ మీడియాకు తెలిపారు.
కేసు ఏమిటి?
నకిలీ పుట్టినరోజు సర్టిఫికెట్ కేసు 2019 జనవరి3వ తేదీ నాటిది. ప్రస్తుత రాంపూర్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆకాష్ సక్సేనా ఈ కేసు పెట్టారు. ఆజంఖాన్, ఆయన భార్య ఫాతిమాలు తన కుమారుడైన అబ్దుల్లా ఆజంఖాన్ కోసం రెండు బర్త్ సర్టిఫికెట్లు తీసుకున్నట్టు సక్సేనా పోలీసు కేసు పెట్టారు. ఈ కేసులో ఫోర్జరీ నేరంపై ఈ ముగ్గురికి సెషన్స్ కోర్టు ఏడేళ్లు జైలుశిక్ష విధించింది. ఆజంఖాన్‌కు 2019లో విద్వేష ప్రసంగం చేసిన కేసులో మూడేళ్లు జైలుశిక్ష పడింది. దీంతో ఆయన అసెంబ్లీ సభ్యత్వంపై అనర్హత వేటుపడింది. రాంపూర్ సదర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన 2022లో వరుసగా పదోసారి గెలిచారు. దీంతో 2019లో గెలిచిన రాంపూర్ పార్లమెంటరీ సీటును ఆయన వదులుకున్నారు. పదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆజంఖాన్ లోక్‌సభకు, రాజ్యసభకు సైతం ఎన్నికయ్యారు.
Updated Date - May 24 , 2024 | 04:19 PM