ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Assembly Elections: ఊపందుకున్న ప్రచారం.. ఈసీ సోదాలు

ABN, Publish Date - Nov 14 , 2024 | 08:01 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అలాంటి వేళ..

ముంబయి, నవంబర్ 14: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో మహాయుతి కూటమిలోని పార్టీలు.. అలాగే మహా వికాస్ ఆఘాడీలోని భాగస్వామ్య పక్షాలు అధికారంలో అందుకోవాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఆ క్రమలో ఆయా పార్టీల నేతలు, అధినేతలు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టారు. ఒక రోజు.. రెండు నుంచి మూడు నాలుగు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఇక జాతీయ పార్టీల అగ్రనేతలు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొని..ఓట్లను ఆకర్షిస్తు్న్నారు.

Also Read: జైలులో నా గదిలో సీసీ కెమెరాలు.. ఆ నాటి చేదు ఘటనలు గుర్తు చేసిన


అగ్రనేతల బ్యాగులు తనిఖీలు..

అలాంటి వేళ రాష్ట్రంలోని ప్రతిపక్షం మహా వికాస్ ఆఘాడీ భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ పార్టీ, శివసేన (ఉద్దవ్ ఠాక్రే) అగ్రనేతల బ్యాగులను గురువారం ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల ఘటన తీవ్ర వివాదాస్పదమవుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికర్జున్ ఖర్గేతోపాటు మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలి నాసిక్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. ఆ క్రమంలో హెలికాఫ్టర్ దిగిన వెంటనే వారి బ్యాగులను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Also Read: క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి రాజ్యాన్ని ఏలితే..


సోషల్ మీడియాలో వీడియోలు వైరల్..

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే గోండియా జిల్లాలోని తిరోడాలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు నానా పటోలి బ్యాగును ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేపట్టారు. అలాగే గోరెగావ్‌లో ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీ అభ్యర్థి బ్యాగుల్లో సైతం ఎన్నికల సంఘం అధికారులు సోదాలు నిర్వహించారు.

Also Read: రఘురామపై సీఎం చంద్రబాబు ప్రశంసలు


ఒకే రోజు.. రెండు సార్లు..

మరోవైపు శివసేన (యూబీటీ) అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే బ్యాగులను ఒకే రోజు రెండు సార్లు తనిఖీలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అహ్మద్‌ నగర్ జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆ క్రమంలో శ్రీగొండ, నెవాసా.. రెండు ప్రదేశాల్లో ఆయన బ్యాగుల్లో సోదాలు చేపట్టారు. అయితే ఈ సోదాలపై అధికార పార్టీ మాత్రం స్పందించడం లేదు. కానీ ఎన్నికల సంఘం మాత్రం తనదైన శైలిలో స్పందిస్తుంది.

Also Read: వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేశ్ ఫైర్


ఎన్నికల నేపథ్యంలో ఈ తరహా తనిఖీలు సహజమేనని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. ఇక వారంలో ఉద్దవ్ ఠాక్రే ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ అధికారులపై ఠాక్రే స్పందించిన తీరు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలాగే అధికార మహాయుతీ కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు చెందిన నేతలను తనిఖీ చేయడం లేదని ఠాక్రే ఆరోపణలు గుప్పించిన విషయం విధితమే.

Also Read: ఢిల్లీకి సీఎం చంద్రబాబు


మోదీ, అమిత్ షా..

ఇక తనిఖీలపై శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. తమ పార్టీ నాయకులను తనిఖీలు చేస్తున్నట్లు.. మహాయుతీ కూటమిలోని నేతలు సీఎం షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లతోపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బ్యాగేజ్‌లను సైతం సోదాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

For National News And Telugu News

Updated Date - Nov 14 , 2024 | 08:02 PM