ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bangalore: సీఎం పదవి కోసం ఆత్రుత వద్దు..

ABN, Publish Date - May 11 , 2024 | 01:02 PM

సీఎం పదవి కోసం డీకే శివకుమార్‌(DK Shivakumar) ఆత్రుత పడరాదని బీజేపీ నేత, తుమకూరు లోక్‌సభ అభ్యర్థి సోమణ్ణ(Somanna) సూచించారు. శనివారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

- డీకే శివకుమార్‌కు సోమణ్ణ సూచన

బెంగళూరు: సీఎం పదవి కోసం డీకే శివకుమార్‌(DK Shivakumar) ఆత్రుత పడరాదని బీజేపీ నేత, తుమకూరు లోక్‌సభ అభ్యర్థి సోమణ్ణ(Somanna) సూచించారు. శనివారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. డీకే శివకుమార్‌ జేడీఎస్‌ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబంపై విమర్శలను ఆపాలని సూచించారు. కుమారస్వామి, డీకే శివకుమార్‌ల మధ్య సాగుతున్న వాగ్వాదం సమంజసంగా లేదన్నారు. తప్పు చేసినవారికి శిక్ష అనివార్యం కావాలని అయితే వారిద్దరూ గతంలో ఆప్తులుగా ఉన్నారని ప్రస్తుతం ఈ విషయంలో నిరంతరం కత్తులు దూసుకునేలా మాట్లాడడం తగదన్నారు.

ఇదికూడా చదవండి: Voter ID: మీకు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా.. ఇలా ఓటు వేయొచ్చు

జేడీఎస్‌, కాంగ్రెస్‏లోని ఒక్కలిగ సామాజికవర్గానికి చెందిన వారి మధ్య విబేధాలు తారస్థాయికి చేరుతున్నాయన్నారు. ఇద్దరి తరపున సమాజానికి చెందినవారు రెండుగా చీలిపోతారన్నారు. ఓ ప్రశ్నకు సమాధానంగా డీకే శివకుమార్‌ ఇప్పటికే అన్ని పదవులను అలంకరించారని, అత్యున్నతమైన సీఎం పదవికి ఓ అడుగు దూరంలో ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన సీఎం కావాలని తానూ భావించానన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆత్రుతగా నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డారు.

ఇదికూడా చదవండి: PM Modi: ఒడిశాలో మోదీ పర్యటన నేడు.. కీలక ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 11 , 2024 | 01:02 PM

Advertising
Advertising