Bangalore: రాజీనామా చేస్తే ప్రాణాలతో ఉంటావ్..
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:38 PM
రాజ రాజేశ్వరీనగర్ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న(Raja Rajeshwari Nagar BJP MLA Munirathna)పై బుధవారం గుడ్డుతో దాడి చేసిన వివాదంలో ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పలు సంచలన విషయాలు నమోదు చేసుకున్నారు.
బెంగళూరు: రాజ రాజేశ్వరీనగర్ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న(Raja Rajeshwari Nagar BJP MLA Munirathna)పై బుధవారం గుడ్డుతో దాడి చేసిన వివాదంలో ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పలు సంచలన విషయాలు నమోదు చేసుకున్నారు. ఏకంగా ఏడు పేజీల ఫిర్యాదులో పలువురి వేధింపులు వివరించారు. ఈనెల 5న ఇద్దరు న్యాయవాదుల రూపంలో వచ్చి ఇప్పటికీ మించినది లేదని, వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని హెచ్చరించారన్నారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముందుగా పోక్సో కేసులో జైలుకు పంపుతామని హెచ్చరించినట్లు పేర్కొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Metrorail: డ్రైవర్ రహిత మెట్రోరైల్ ట్రయల్ రన్
మా అన్న డీకే సురేష్ సంతోషంగా ఉండాలని, లోక్‌సభ ఎన్నికలలో ఓడించినందుకు బాధపడ్డారని తెలిపినట్లు పేర్కొన్నారు. అన్న సంతోషంగా ఉండాలంటే కుసుమ రజరాజేశ్వరీనగర్ ఎమ్మెల్యే కావాలని బెదరించినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం లక్ష్మీహెబ్బాళ్కర్ తరహాలోనే కుసుమ మంత్రి కావాలని ఇదంతా జరగాలంటే ముందు రాజీనామా చేయాలని లేదంటే 100-150ల మంది సిద్ధంగా ఉంటా రని నియోజకవర్గంలో ఏ కార్యక్రమంలో పాల్గొన్నా వారు వెంటాడుతారని యాసిడ్ గుడ్లతో దాడి చేస్తారని మసిపూసి చెప్పుల హారం వేస్తారని హెచ్చరించారన్నారు.
ఆ పరిణామమే దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో మాజీ ఎంపీ డీకే సురేష్, స్థానిక పార్టీ ముఖ్యనాయకురాలు కుసుమా, లక్ష్మీహెబ్బళ్కర్(Lakshmi Hebbalkar)తో పాటు 150ల మంది పేర్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. గుడ్లతో దాడి చేసిన వారిని అరెస్టు చేసి వెంటనే విడుదల చేసిన విషయమై కూడా ఎమ్మెల్యే కుట్రలో భాగమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి గురైన ఎమ్మెల్యే మునిరత్నను బెంగళూరు గ్రామీణ ఎంపీ, డాక్టర్ మంజునాథ్ పరామర్శించారు. గుడ్డులో యాసిడ్ కారకాలు ఉన్నా యని అభిప్రాయపడ్డారు. కాగా బుధవారం ఎమ్మె ల్యేపై గుడ్లతో దాడి చేసి అరెస్టు అయిన విశ్వనాథ్, కృష్ణమూర్తి, చంద్రులు పోలీసులకు ఎమ్మెల్యేపై ప్రతిఫిర్యాదు చేశారు. గుంపుగా చేరి తమపై దాడికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసిన మేరకు ప్రతిఘటించామని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
ఈవార్తను కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో 600పీవో పోస్టులకు నోటిఫికేషన్
ఈవార్తను కూడా చదవండి: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..
ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..
Read Latest Telangana News and National News
Updated Date - Dec 27 , 2024 | 12:38 PM