ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bangalore: సింహాసనం.. సిద్ధమయ్యిందిగా..

ABN, Publish Date - Sep 28 , 2024 | 01:08 PM

ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలకు అంతా సిద్ధమయ్యింది. ఓవైపు విద్యుద్దీపాల అలంకరణ, మరోవైపు గజరాజుల విన్యాసాలతో రాచనగర వీధులు శోభాయామానంగా దర్శనమిస్తున్నాయి.

- లాకర్ల నుంచి బయటకు తీసిన అధికారులు

- మైసూరు దసరా ఉత్సవాల షెడ్యూల్‌ విడుదల

బెంగళూరు: ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలకు(Mysore Dussehra Festivals) అంతా సిద్ధమయ్యింది. ఓవైపు విద్యుద్దీపాల అలంకరణ, మరోవైపు గజరాజుల విన్యాసాలతో రాచనగర వీధులు శోభాయామానంగా దర్శనమిస్తున్నాయి. ప్యాలెస్‌ సంప్రదాయంలో భాగంగా శుక్రవారం బంగారు వజ్రఖచిత సింహాసనం అమరిక జరిగింది. తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలు కొనసాగాయి. లాకర్లలో భద్రపరిచిన విడిభాగాలను జిల్లా అధికారుల సమక్షంలో బయటకు తీసుకొచ్చారు. 7.30 గంటలకు నవగ్రహ, శాంతి హోమాలు జరిగాయి. 9.55 గంటలకు దర్బార్‌ హాల్‌లో సింహాసనాన్ని అమర్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో రాజమాత ప్రమోదాదేవి ఒడెయార్‌, ప్యాలెస్‌ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం


3 నుంచి దసరా ఉత్సవాలు..

అక్టోబరు 3నుంచి శరన్నవ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఉదయం పూజలతో శ్రీకారం చుడతారు. తెల్లవారుజామున 5.45 గంటలకు రత్నఖచిత సింహాసనానికి ముఖం అమర్చే ప్రక్రియ చేపడతారు. ప్యాలెస్‏లో యదువంశరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్‌కు కంకణధారణ చేయనున్నారు. 10.30 గంటలకు పట్టపుటేనుగు, ప్యాలె స్‌ గుర్రాలు, ఆవులకు పూజలు చేస్తా రు. 12 గంటలకు సింహాసనంపై యువరాజు ఆశీనులు కావడం ద్వారా ప్రైవేట్‌ దర్బార్‌ ప్రారంభం కానుంది.


మధ్యాహ్నం 1 గంటకు కులదేవత చాముండేశ్వరిదేవి మూర్తిని ఊయల్లో ఉంచి ప్యాలెస్‌టో ఉత్సవాలు ప్రారం భిస్తారు. 4న పారంపార్య మోటర్‌బైక్‌ ర్యాలీ జరుగుతుంది. అక్టోబరు 9న బుధవారం ఉదయం 10 గంటలకు సరస్వతి పూజ చేస్తారు. 10న రాత్రి ప్రైవేట్‌ దర్బార్‌ ముగియనుంది. 11న దుర్గాష్టమి జరగనుంది. ప్రతిరోజూ ప్యాలెస్‌ లోపల రాజసంప్రదాయంగా పూజ లు, కార్యక్రమాలు కొనసాగి, ప్రభుత్వ కార్యక్రమాలు నిరంతరంగా ఉంటాయి.


......................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.......................................................................

Bangalore: లోకాయుక్త ముందుకు కేంద్రమంత్రి..

- గంగేనహళ్ళి డీ నోటిఫికేషన్‌ కేసులో విచారణకు హాజరైన కేంద్ర మంత్రి

బెంగళూరు: డీ నోటిఫికేషన్‌ వివాదంలో లోకాయుక్త విచారణకు కేంద్రమంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy) హాజరయ్యారు. గంగేనహళ్ళి డీ నోటిఫికేషన్‌కు సంబంధించి లోకాయుక్త పోలీసులు కుమారస్వామికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఢిల్లీ నుంచి వచ్చిన కుమారస్వామి ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా లోకాయుక్త కార్యాలయానికి వెళ్లారు. విచారణ ముగిసిన అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ సోమవారం హాజరు కావాలని నోటీసు ఇచ్చారని ఢిల్లీలో మరో కార్యక్రమం ఉన్నందున రాలేకపోయానన్నారు.


ఇదే విషయాన్ని ముందస్తుగా లోకాయుక్త అధికారులకు వివరించానన్నారు. డీఎస్పీ బసవరాజ్‌ ముగదం విచారణ జరిపారన్నారు. గతంలోనే ఈ అంశంపై ఎలాంటి తప్పు చేయలేదని వివరించానని, లోకాయుక్త ముందుకూడా అదే వివరాలు తెలిపానన్నారు. కాగా యడియూరప్ప సీఎంగా ఉన్నప్పుడు డీ నోటిఫికేషన్‌ జరగ్గా కుమారస్వామి తమ సమీప బంధువుల లాభం కోసం బీడీఏ ఆస్తిని నిబంధనలు మీరి డీ నోటిఫికేషన్‌ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదంలో యడియూరప్పకు నోటీసులు ఇవ్వగా ఇప్పటికే ఆయన విచారణలో పాల్గొన్నారు. తాజాగా కుమార విచారణకు వచ్చారు.


ఇదికూడా చదవండి: హర్ష సాయి కేసులో కొత్త ట్విస్ట్..

ఇదికూడా చదవండి: కాంగ్రెస్‌కు పోయే కాలం దగ్గర పడింది..

ఇదికూడా చదవండి: మేము నిర్మిస్తే కాంగ్రెస్‌ కూల్చేస్తోంది: కేటీఆర్‌

ఇదికూడా చదవండి: పెద్ద వెంచర్లన్నీ పెండింగ్‌లోనే!

Read Latest Telangana News and National News

Updated Date - Sep 28 , 2024 | 01:08 PM