Home » Dasarath
బతుకమ్మ, దసరా(Bathukamma, Dussehra) పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ చార్జీల షాక్ ఇచ్చింది. పండుగ సందర్భంగా నడుపుతున్న స్పెషల్ బస్సుల్లో అదనంగా 25 శాతం చార్జీలు పెంచింది. నగరం నుంచి తెలంగాణ, ఏపీలోని జిల్లాలకు వెళ్లే స్పెషల్ సర్వీసులకు ఈ చార్జీలు వర్తిస్తాయని పేర్కొంది.
దసరా, సద్దుల బతుకమ్మ పండుగల(Dasara and Saddula Bathukamma festivals) నేపథ్యంలో ఇటు తెలంగాణ జిల్లాలకు, అటు ఆంధ్రా ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) కిటికిటలాడుతోంది. ఒకవైపు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు కావడంతో నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
సద్దుల బతుకమ్మ, దసరాకు 6,304 ప్రత్యేక బస్సులను జిల్లాలకు నడుపుతున్నామని, స్పెషల్ ఆపరేషన్స్‌కు పోలీస్, రవాణా శాఖల అధికారులు సహకరించాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(TGS RTC MD VC Sajjanar) కోరారు.
శక్తి స్వరూపిణి జగజ్జనని శక్తి స్వరూపిణి అయిన జగజ్జనని ఈ జగమంతా అనేకానేక రూపాలలో వుంటుంది. వాటిలో కొన్ని రూపాలకు విశేష చరిత్ర వుంది. మరికొన్ని రూపాలను సాధకులు తమ సాధనలు, కోరికలు త్వరగా ఫలించేందుకు ఎంచుకుని పూజలు చేస్తుంటారు.
దసరా వేడుకులకు ఆలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. ఈ నెల 3 (నేటి) నుంచి 12వ తేదీ వరకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బల్కంపేట అమ్మవారి ఆలయం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి(Secunderabad Ujjain Mahakali) అమ్మవారి ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలకు అంతా సిద్ధమయ్యింది. ఓవైపు విద్యుద్దీపాల అలంకరణ, మరోవైపు గజరాజుల విన్యాసాలతో రాచనగర వీధులు శోభాయామానంగా దర్శనమిస్తున్నాయి.
ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాల్లో(Mysore Dussehra Festivals) పాల్గొనే ‘గజ పయనం’ ఘనంగా ప్రారంభమయ్యింది.