ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

National : చర్మాన్ని ఒలిచి.. శరీరాన్ని ముక్కలు చేసి..

ABN, Publish Date - May 25 , 2024 | 05:56 AM

చికిత్స కోసం కోల్‌కతా వచ్చిన బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ హత్య కేసులో దారుణ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌ సీఐడీ పోలీసులు శుక్రవారం బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిని బెంగాల్‌లోనే అరెస్టు చేశారు.

అతి దారుణంగా బంగ్లాదేశ్‌ ఎంపీ హత్య

కోల్‌కతా, మే 24: చికిత్స కోసం కోల్‌కతా వచ్చిన బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ హత్య కేసులో దారుణ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌ సీఐడీ పోలీసులు శుక్రవారం బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిని బెంగాల్‌లోనే అరెస్టు చేశారు. ముంబయిలో కసాయిగా పనిచేసే అతనికి ఎంపీ హత్యలో కీలక పాత్ర ఉన్నట్టు గుర్తించారు. న్యూ టౌన్‌ ఏరియాలోని ఫ్లాట్‌లో ఎంపీని హత్య చేసిన తరువాత అతని చర్మాన్ని వలిచి, ముక్కలుగా నరికామని విచారణలో ఆ కసాయి అంగీకరించాడు. దీనిపై ఓ సీఐడీ అధికారి మాట్లాడుతూ ‘‘ఎంపీని చంపించే ఉద్దేశంతో కొద్ది నెలల క్రితమే అతడిని కోల్‌కతా పిలిపించారు. తనతో పాటు మరో నలుగురు వ్యక్తులు ఆ ఎంపీని హత్య చేసి, చర్మాన్ని వలిచి, భౌతిక దేహాన్ని ముక్కలుగా నరికి పలు చోట్ల పారవేసినట్టు అంగీకరించాడు’’ అని చెప్పారు. శరీర భాగాలను భనగర్‌, కృష్ణమాటి గ్రామాల్లోని చెరువుల్లో పడేశామని చెప్పడంతో పోలీసులు శరీర భాగాలను వెతికే ప్రయత్నం చేశారు. నిందితుడిని బారసత్‌ కోర్టులో హాజరు పరచగా, కోర్టు అతనికి 12 రోజుల సీఐడీ కస్టడీ విధించింది. ఇదిలా ఉండగా, అమెరికా పౌరసత్వం కలిగిన శిలాస్తి రహ్మాన్‌, ఎంపీ అన్వరుల్‌కు స్నేహితురాలని, హత్యకు ఆమెనే సూత్రధారి అని సీఐడీ పోలీసులు తెలిపారు.

Updated Date - May 25 , 2024 | 05:58 AM

Advertising
Advertising