Vijay Diwas: మోదీ పోస్టుపై బంగ్లాదేశ్ అక్కసు
ABN, Publish Date - Dec 17 , 2024 | 05:00 PM
పాకిస్థాన్ సైన్యం 1971 డిసెంబర్‌లో భారత బలగాల ముందు లొంగిపోయిన రోజును 'విజయ్ దివస్'గా జరుపుకొంటాం. బంగ్లాదేశ్ మాత్రం మార్చి 26న 'ఇండిపెండెన్స్ డే' జరుపుతుంది.
న్యూఢిల్లీ: 'విజయ్ దివస్' (Vijay Diwa)ను ''1971లో భారత్ సాధించిన చారిత్రక విజయం''గా పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చేసిన పోస్టుపై మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలోని పలువురు మంత్రులతో సహా అక్కడి రాజకీయనేతలు అక్కసు వెళ్లగక్కారు. "ఇండియా కేవలం మిత్రదేశం (Ally) మాత్రమే, అంతకుమించి చేసిందేమీ లేదు'' అంటూ 'విజయ్ దివస్' హుందాతనం తగ్గేంచేలా వ్యాఖ్యలు చేశారు.
One Nation One Election Bills: జమిలి బిల్లులకు అనుకూలంగా 269 ఓట్లు
మోదీ సందేశం
విజయ దివస్ సందర్భంగా సాహస జవాన్లు, అమరవీరులను మోదీ స్మరించుకుంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. ''ఈరోజు విజయ్ దివస్. 1971లో భారతదేశ చారిత్రక విజయానికి తమ ప్రాణాలు అర్పించిన అమరవీరులు, సాహస జవాన్లను సంస్మరించుకునే రోజు. వారి అంకితభావం, చెక్కుచెదరని పట్టుదల మనదేశానికి రక్షాకవచంగా, గర్వకారణంగా నిలుస్తోంది. వారి అసామాన్య సాహసం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. భవిష్యత్ తరాలకు వీరు స్ఫూర్తిదాయకం'' అని మోదీ ప్రశంసించారు.
పాకిస్థాన్ సైన్యం 1971 డిసెంబర్‌లో భారత బలగాల ముందు లొంగిపోయిన రోజును 'విజయ్ దివస్'గా జరుపుకొంటాం. బంగ్లాదేశ్ మాత్రం మార్చి 26న 'ఇండిపెండెన్స్ డే' జరుపుతుంది. భారత్ కీలక సాయంతో 'లిబరేషన్ వార్' ముగిసిన తొమ్మిది నెలల తర్వాత డిసెంబర్ 16న బంగ్లా రాజధానిగా ఢాకా ఏర్పడింది.
బంగ్లా అక్కసు
కాగా, భారత ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ 'విజయ్ దివస్'ను 1971లో భారత్ సాధించిన చారిత్రక విజయంగా పేర్కొంటూ చేసిన పోస్ట్‌పై బంగ్లా నేతలు నిరసన వ్యక్తం చేశారు. ''బంగ్లేదేశ్ విజయం సాధించిన రోజు 1971 డిసెంబర్ 16. ఈ విజయానికి భారత్ చేయూత నిచ్చిందే కానీ అంతకు మించి ఏమీ లేదు'' అని మహమ్మద్ యూనుస్ న్యాయ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ వ్యాఖ్యానించారు. వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమం నేత హస్నత్ అబ్దుల్లా సైతం మోదీ సోషల్ మీడియా పోస్ట్‌పై నిరసన తెలిపారు. ''ఇది బంగ్లా విముక్తి పోరాటం. పాకిస్థాన్ నుంచి బంగ్లా స్వాతంత్ర్య కోసం జరిగిన పోరు. కానీ మోదీ మాత్ర ఇండియా చేసిన పోరాటం, విజయం తమదేనన్నట్టు చెబుతున్నారు. తద్వారా బంగ్లాదేశ్ ఉనికిని విస్మరిస్తున్నారు'' అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, బంగ్లా నేతల వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ వెంటనే స్పందించలేదు.
ఇండో-బంగ్లా సంబంధాలు
1971 డిసెంబర్ 16వ తేదీని పాకిస్థాన్‌పై సాధించిన విజయంగా ఏటా భారత్, బంగ్లాదేశ్ జరుపుకొంటాయి. రెండు దేశాల్లో జరిగే వేడుకలకు నాటి యుద్ధంలో పాల్గొన్న రిటైర్డ్ సైనికులు, సేవలందించిన అధికారులను ఇరుదేశాలు ఆహ్వానించుకుంటాయి. ఈ ఏడాది కూడా బంగ్లా విముక్తి పోరాటంలో పాల్గొన్న ఎనిమిది మంది భారత మిలటరీ వెటరన్లు ఢాకా వెళ్లగా, బంగ్లా ఆర్మీకి చెందిన ఎనిమిది మంది వార్ వెటరన్లు కోల్‌కతా వచ్చారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల మైనారిటీ హిందువులపై వరుస దాడులు జరగడంతో భారత్-బంగ్లా మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి.
ఇవి కూడా చదవండి..
Priyanka Gandhi: నిన్న పాలస్తీనా, నేడు బంగ్లా బ్యాగ్
Kasturi: గర్భాలయంలోకి ఎవరికీ ప్రవేశం లేదు..
Ajit Doval: చైనా పర్యటనకు అజిత్ ఢోబాల్
For National News And Telugu News
Updated Date - Dec 17 , 2024 | 05:00 PM