ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

West Bengal: దీదీతో గొడవకు కారణం ఆ మంత్రే.. బెంగాల్ గవర్నర్ సంచలనం

ABN, Publish Date - Apr 06 , 2024 | 02:44 PM

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్ సివి ఆనంద బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో తనకు మంచి ఫ్రెండ్ షిప్ ఉండేదన్నారు. బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు వల్లే తమ మధ్య దూరం పెరిగిందని వివరించారు. బెంగాల్ యూనివర్సిటీ క్యాంపస్‌లను రాజకీయ కార్యకలాపాల కోసం ఉపయోగించే అంశంపై గవర్నర్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Bengal Education Minister Spoiling My Relation With CM Mamata Governor Ananda Bose

కోల్ కతా: పశ్చిమ బెంగాల్‌ (West Bengal) గవర్నర్ సివి ఆనంద బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో (Mamata Banerjee) గొడవకు గల కారణం విద్యాశాఖ మంత్రి అని స్పష్టం చేశారు. బ్రత్యా బసు వల్లే దీదీతో దూరం పెరిగిందని ఆయన వివరించారు. బెంగాల్ యూనివర్సిరటీ క్యాంపస్‌లను రాజకీయ కార్యకలాపాల కోసం ఉపయోగించే అంశంపై గవర్నర్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఇలా కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


అంతా బాగానే ఉండే

‘బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో ఇదివరకు బాగా ఉండేవాడిని. విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు వల్ల పరిస్థితి దిగజారింది అని’ గవర్నర్ ఆనంద బోసు మండిపడ్డారు. అంతకుముందు యూనివర్సిటీ క్యాంపస్‌ల‌ను రాజకీయ కార్యకలాపాల కోసం కేటాయించడంపై రిటైర్డ్ జడ్జీతో విచారణకు ఆదేశించారు. విశ్వవిద్యాలయాల్లో అవినీతి, హింస జరగడంతో గవర్నర్ బోసు ఆందోళన వ్యక్తం చేశారు.


కారణమిదే..?

గౌర్ బంగా యూనివర్సిటీ మైదానంలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన అనుబంధ వెబ్ క్యూపా సమావేశం ఇటీవల జరిగింది. ఆ కార్యక్రమానికి వివిధ యూనివర్సిటీలకు చెందిన 1700 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు కూడా హాజరయ్యారు. ఆ ఘటన జరిగిన తర్వాత గవర్నర్ బోస్ వైస్ ఛాన్స్‌‌లర్‌ రజత్ కిశోర్ దేను పదవి నుంచి తొలగించారు. గవర్నర్ చర్యను బెంగాల్ ప్రభుత్వం ఖండించింది. ఆ తర్వాత బెంగాల్ ప్రభుత్వం తిరిగి వీసీగా నియమించింది. ఆ తర్వాత గవర్నర్ మమత బెనర్జీ గురించి ప్రస్తావించారు.


ఇవి కూడా చదవండి:

Kejriwal: కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్.. ఎఫ్ఐఆర్ ను తిరస్కరించిన కోర్టు..


NIA Team Attacked: నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్తే ఎటాక్ చేశారు..వీడియో

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 06 , 2024 | 02:44 PM

Advertising
Advertising