ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata: దీదీపై పరువు నష్టం కేసు వేసిన గవర్నర్

ABN, Publish Date - Jun 29 , 2024 | 09:54 PM

పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee)కి ఆ రాష్ట్ర గవర్నర్‌కి మధ్య పరిస్థితి ఉప్పు నిప్పుల మారింది. తన పరువుకు దీదీ భంగం కలిగించారని ఆరోపిస్తూ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్(CV Ananda Bose) ఆమెపై పరువు నష్టం దావా వేశారు.

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee)కి ఆ రాష్ట్ర గవర్నర్‌కి మధ్య పరిస్థితి ఉప్పు నిప్పుల మారింది. తన పరువుకు దీదీ భంగం కలిగించారని ఆరోపిస్తూ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్(CV Ananda Bose) ఆమెపై పరువు నష్టం దావా వేశారు.

రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లేందుకు మ‌హిళ‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని ఇటీవ‌ల దీదీ అన్నారు. ఈ ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ ఆనంద్ బోస్ కేసు దాఖ‌లు చేశారు. ప్రజాప్రతినిధులు ఉన్నత స్థానంలో ఉన్న వారిపై త‌ప్పుడు అభిప్రాయాల‌ను సృష్టించరాదని ఆయన కోరారు. రాజ్‌భ‌వ‌న్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఎంసీ నేతలపైనా గవర్నర్ కేసు వేశారు.


రాజ్‌భ‌వ‌న్‌లో బోస్ వేధింపుల‌కు పాల్పడినట్లు కాంట్రాక్టు మ‌హిళా ఉద్యోగి ఒక‌రు గత నెలలో ఫిర్యాదు చేశారు. ఆ కేసులో కోల్‌క‌తా పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించగా.. ఈ అంశంపై స్పందించేందుకు టీఎంసీ ఎంపీ డోలా సేన్ స్పందించేందుకు నిరాకరించారు. ఏం జరిగిందన్నది అంతర్గతంగా చర్చించాల‌ని, ఇది చాలా సున్నితమైన అంశమని పేర్కొన్నారు. అయితే టీఎంసీపై, సీఎం మమతపై పరువు నష్టం దావా వేయడాన్ని బీజేపీ సమర్థించింది. ఈ నిర్ణయాన్ని ఎప్పుడో తీసుకోవాల్సిందిగా పార్టీ పేర్కొంది. బీజేపీ తరఫున గవర్నర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపింది.

Latest Telugu News And National News

Updated Date - Jun 29 , 2024 | 09:54 PM

Advertising
Advertising