ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata doctor rape-murder: బీజేపీ నేత లాకెట్ ఛటర్జీకి కోల్‌కతా పోలీసులు సమన్లు

ABN, Publish Date - Aug 18 , 2024 | 01:54 PM

సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ ఘటనపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారనే అభియోగంపై ప్రశ్నించేందుకు బీజేపీ నేత లాకెట్ ఛటర్జీకి కోల్‌కతా పోలీసులు ఆదివారంనాడు సమన్లు పంపారు.

కోల్‌కతా: సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ ఘటనపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారనే అభియోగంపై ప్రశ్నించేందుకు బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ (Locket Chatterjee)కి కోల్‌కతా పోలీసులు సమన్లు పంపారు. ఆమెతో పాటు డాక్టర్లు కునల్ సర్కార్, సుబర్నో గోస్వామి కూడా సమన్లు జారీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల లోపు పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు.


కోల్‌కతా డాక్టర్ పోస్ట్ మార్టం నివేదకను తాను చూశానని, 150 గ్రాముల సెమన్, పెల్విక్ బోన్ విరగడం వంటివి అందులో ఉన్నాయని, దీనిని బట్టి సామూహిక అత్యాచారం జరిగినట్టు కనిపిస్తోందని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ గోస్వామి వెల్లడించారు. అయితే, ఆయన వాదనను కోల్‌కతా పోలీసులు తోసిపుచ్చారు. పోస్ట్‌మార్టం నివేదికలో అలాంటివేమీ లేవని, ఇందులో నిజం ఎంతమాత్రం లేదని, పైగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఖండించారు. కాగా, బాధితురాలి పేరు, ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంపై లాకెట్ ఛటర్జీని పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.

Kolkata: చేతులెత్తేసిన మమత సర్కార్.. కోల్‌కతా ఫుట్‌బాల్ మ్యాచ్ రద్దు


లాకెట్ ఛటర్జీ కౌంటర్...

ఇదిలా ఉండగా, కోల్‌కతా పోలీసులు, మమతా బెనర్జీ ప్రభుత్వంపై లాకెట్ ఛటర్జీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మండిపడ్డారు. సోషల్ మీడియా పోస్టులు, వ్యక్తులు, విపక్ష నేతలపై కాకుండా ఆర్జీ కర్ కేసు బాధితురాలికి న్యాయం జరిపించడంపై ప్రభుత్వం, పోలీసులు దృష్టి సారిస్తే బాగుంటుందని హితవు పలికారు. సీబీఐకి సహకరించడం, సాక్ష్యాలను తారుమారు చేయకుండా చూడటంపై ప్రభుత్వ యంత్రాగం దృష్టి పెట్టాలన్నారు. బాధితురాలి కుంటుంబం తమకు ఎప్పుడెప్పుడు న్యాయం జరుగుతుందా అని ఎదురుతెన్నులు చూస్తున్నారని చెప్పారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 18 , 2024 | 01:54 PM

Advertising
Advertising
<