Bengaluru: పెళ్లికి నో అన్న లవర్.. ఏం చేశాడంటే..?
ABN, Publish Date - Apr 01 , 2024 | 06:47 PM
ఐటీ హబ్ బెంగళూర్‌లో (Bengaluru) ఓ క్యాబ్ డ్రైవర్ దారుణానికి ఒడిగడ్డాడు. సహజీవనం చేస్తోన్న మహిళపై కత్తితో దాడికి తెగబడ్డాడు. తీవ్ర గాయాలైన సదరు మహిళ ఘటనా స్థలంలోనే కన్నుమూసింది.
బెంగళూర్: ఐటీ హబ్ బెంగళూర్‌లో (Bengaluru) ఓ క్యాబ్ డ్రైవర్ దారుణానికి ఒడిగడ్డాడు. సహజీవనం చేస్తోన్న మహిళపై కత్తితో దాడికి తెగబడ్డాడు. తీవ్ర గాయాలైన సదరు మహిళ ఘటనా స్థలంలోనే కన్నుమూసింది. షాలిని గ్రౌండ్ వద్ద జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఏం జరిగిందంటే..?
బెంగళూర్ (Bengaluru) జయనగర్‌కు చెందిన గిరీష్ (35) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫరీదాతో అతనికి పరిచయం ఉంది. వయస్సులో ఫరిదా గిరీష్ కన్నా ఏడేళ్ల పెద్దది. వారి మధ్య పరిచయం రిలేషన్ షిప్‌కు దారితీసింది. ఫరీదాకు పెళ్లయ్యింది. భర్తతో ఉండటం లేదు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఫరీదాను పెళ్లి చేసుకోవాలని గిరీష్ అనుకున్నాడు. ఇదివరకు చాలా సందర్భాల్లో ఆమె వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు.
మతం మారి
తన సోదరికి వివాహం చేసేందుకు గిరీష్ 2011లో ఇస్లాం మతంలోకి మారాడు. ఆ తర్వాత హిందూ మతంలోకి వచ్చాడు. అయినప్పటికీ కొన్ని ఇస్లాం మత సంప్రదాయాలను పాటిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్ వెళ్లిన ఫరీదా మార్చి 26వ తేదీన తిరిగి వచ్చింది. మార్చి 29వ తేదీన గిరీష్ బర్త్ డే.. ఆ రోజున అతనితో గడపాలని అనుకొంది. తన కూతుళ్లకు మంచి కాలేజీ వెతకాలని భావించింది. హోటల్‌లో గది తీసుకొని ఉంది. కూతుళ్లతో షాపింగ్ చేసింది.. లంచ్ కూడా బయట చేసి హోటల్‌కు వచ్చారు. సాయంత్రం షాలిని గ్రౌండ్స్ వద్దకొచ్చారు. అక్కడ గిరీష్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆమె తోసిపుచ్చింది. కోపోద్రిక్తుడైన గిరీష్ ఫరీదాపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి:
Gyanvapi: అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Delhi: దేశ ప్రజలకు అలర్ట్.. ఈ 7 రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఐఎండీ హెచ్చరిక
Updated Date - Apr 01 , 2024 | 06:49 PM