ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

HD Revanna: హెచ్‌డీ రేవణ్ణకు ఊరట.. కిడ్నాపింగ్ కేసులో కండిషన్డ్ బెయిల్

ABN, Publish Date - May 13 , 2024 | 09:10 PM

హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడుల బాధితురాలిని అపహరించారనే కేసులో ఆయన తండ్రి, జనతాదళ్ సెక్యులర్ నేత, హోలెనర్సిపుర ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిలును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ సోమవారంనాడు మంజూరు చేశారు.

బెంగళూరు: హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడుల బాధితురాలిని అపహరించారనే కేసు (Kidnapping case)లో ఆయన తండ్రి, జనతాదళ్ సెక్యులర్ నేత, హోలెనర్సిపుర ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ (HD Revanna)కు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిలును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ సోమవారంనాడు మంజూరు చేశారు. రూ.5 లక్షల పూచీకత్తుతో పాటు కొన్ని షరతులు విధించారు.


కిడ్నాపింగ్ కేసులో హెచ్‌డీ రేవణ్ణ దాఖలు చేసిన ముందస్తు బెయిలును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తోసిపుచ్చడంతో మే 4న ఆయన పోలీసులు అరెస్టు చేశారు. మే 8 వరకూ పోలీసు కస్టడీకి కోర్టు అప్పగించింది. ఆ తర్వాత మే 14 వరకూ ఆయనకు జ్యూడిషయల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల బాధితురాలిని హెచ్‌డీ రేవణ్ణ ఆదేశాలతోనే ఆయన అనుచరుడు ఏప్రిల్ 29న ఇంటి నుంచి అపహరించుకు వెళ్లినట్టు కోర్టుకు 'సిట్' తన వాదన వినిపించింది. మే 5న హెచ్‌డీ రేవణ్ణ సన్నిహితునికి చెందిన ఒక పొలంలో బాధిత మహిళను కనుగొన్నట్టు తెలిపింది. ఇరువర్గాల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారంనాడు తీర్పును వెలువరిస్తూ రేవణ్ణకు షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది.

Read Latest Telangana News and National News

Updated Date - May 13 , 2024 | 09:11 PM

Advertising
Advertising