Bengaluru: రాష్ట్రమంతటా ‘ఫెంగల్’ బీభత్సం..
ABN, Publish Date - Dec 03 , 2024 | 01:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ఫెంగల్ తుఫాను ప్రభావం తీవ్రస్థాయికి చేరింది. రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ప్రధానంగా తీరప్రాంత జిల్లాలు ఉత్తర కన్నడ, దక్షిణకన్నడ, ఉడుపి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
- తీరప్రాంత, మలెనాడు జిల్లాల్లో ప్రభావం
- చేపలవేటకు వెళ్లరాదని అధికారుల హెచ్చరిక
- బెంగళూరులోనూ దంచి కొట్టిన వర్షం
- పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా ఫెంగల్ తుఫాను ప్రభావం తీవ్రస్థాయికి చేరింది. రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ప్రధానంగా తీరప్రాంత జిల్లాలు ఉత్తర కన్నడ, దక్షిణకన్నడ, ఉడుపి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. పశ్చిమ కనుమలకు అనుబంధమైన మలెనాడు, శివమొగ్గ, చిక్కమగళూరు, కొడగు(Malenadu, Shivamogga, Chikmagalur, Kodagu) జిల్లాల్లోనూ విస్తారంగా వానలు కురుస్తున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Tirupati: ఎస్వీయూ ఇంజినీరింగ్ కాలేజీలో ‘అన్యమత’ కలకలం
మైసూరు, మండ్య, రామనగర, కోలారు, చిక్కబళ్ళాపుర జిల్లాల్లో భారీ వర్షం కారణంగా సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లోనూ వర్షం అలజడి సృష్టిస్తోంది. బెంగళూరులో ఆదివారం రాత్రి ప్రారంభమైన వర్షం సోమవారం రోజంతా కొనసాగింది. నగర ప్రజలు సంచరించేందుకు ఇబ్బంది పడ్డారు. వారాంతం ముగిసి ఆఫీసులు, ఐటీబీటీ కంపెనీలకు వెళ్లేందుకు ఉద్యోగులు తంటాలు పడ్డారు. కొన్ని కంపెనీల ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోంతో సరిపెట్టుకున్నారు.
వాతావరణ పరిశోధనశాఖ అభిప్రాయం మేరకు మంగళవారం కూడా ఇదే తరహాలో వర్షం ప్రభావం ఉంటుందని తెలిపారు. బెంగళూరు, ఉడుపి, చిక్కమగళూరు, చిక్కబళ్ళాపుర జిల్లాల్లో మరింత ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. మొత్తంగా రాష్ట్రమంతటా వర్షం ప్రభావం కొనసాగింది. కాగా వరుస వర్షం ప్రభావం కారణంగా పాత మట్టి భవనాల గోడలు దెబ్బతిని కూలాయి. బీబీఎంపీ పరిధిలో పలు చోట్ల చెట్లు, చెట్ల కొమ్మలు కూలడంతో ట్రాఫిక్‌కు అంతరాయం నెలకొంది.
ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి కార్యాచరణ నియంత్రణా చర్యలు కొనసాగించాయి. చామరాజపేట నియోజకవర్గంలో ఓ ఇల్లు కూలింది. ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులను స్థానికులు హుటాహుటిన రక్షించారు. కాగా సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 35-55 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని వాతావరణ పరిశోధనశాఖ ప్రకటించింది.
ఈవార్తను కూడా చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..
ఈవార్తను కూడా చదవండి: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 03 , 2024 | 01:06 PM