ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bengaluru: వయనాడ్‌లో వంద ఇళ్లు.. సీఎం లేఖకు కేరళ ముఖ్యమంత్రి సమాధానం

ABN, Publish Date - Dec 24 , 2024 | 01:10 PM

వయనాడ్‌లో వరదబాధితులకు వంద ఇళ్లను నిర్మిస్తామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Karnataka CM Siddaramaiah) రాసిన లేఖకు కేరళ ముఖ్యమంత్రి తనదైన శైలిలోనే దీటుగా స్పందించారు. వయనాడ్‌ పునరావాసం సహాయానికి కేరళ స్పందించలేదని ఇటీవల సీఎం సిద్దరామయ్య రెండోలేఖను పంపిన విషయం తెలిసిందే.

బెంగళూరు: వయనాడ్‌లో వరదబాధితులకు వంద ఇళ్లను నిర్మిస్తామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Karnataka CM Siddaramaiah) రాసిన లేఖకు కేరళ ముఖ్యమంత్రి తనదైన శైలిలోనే దీటుగా స్పందించారు. వయనాడ్‌ పునరావాసం సహాయానికి కేరళ స్పందించలేదని ఇటీవల సీఎం సిద్దరామయ్య రెండోలేఖను పంపిన విషయం తెలిసిందే. అందుకు కేరళ సీఎం పిణరాయ్‌ విజయన్‌(Kerala CM Pinarayi Vijayan) స్పందిస్తూ లేఖ రాశారు.

ఈ వార్తను కూడా చదవండి: Minister: నోటికొచ్చినట్లు మాట్లాడారు.. మహిళ అని సానుభూతి కూడా చూపలేదు


కర్ణాటక(Karnataka)తోపాటు సాయం చేసేవారికి ఒక పరిధి సిద్ధం చేస్తున్నామన్నారు. పునరావాసం ప్రతిదశలోనూ ఉండేలా చూస్తున్నామన్నారు. ఇళ్లు కోల్పోయినవారికి పాత స్థలంలోనే టౌన్‌షిప్ నిర్మించాలని భావిస్తున్నామని, ప్రకృతి వైపరీత్యం సాధ్యం లేనటువంటి వైతరి తాలూకాలోని రెండు ప్రదేశాలను గుర్తించామన్నారు. ఇక్కడి టౌన్‌షిప్ కు సంబంధించి రూపురేఖలు సిద్ధమైన వెంటనే మీకు సమాచారం ఇస్తామన్నారు.


వంద ఇళ్లు నిర్మిస్తామన్నందుకు ధన్యవాదాలన్నారు. వయనాడ్‌లో వరద బాధితులకోసం వివిధ ప్రాంతాలనుంచి సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఇతరత్రా వ్యక్తులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఎక్కడ నిర్మించాలనేది నిర్ధారించకముందే నిర్ణయం తీసుకోకూడదని భావించామన్నారు. పర్యావరణ స్నేహిగా ఉండాలని భావిస్తున్నామన్నారు. ఇళ్లు కోల్పోయినవారి భావనాత్మక సంబంధాలను దూరం చేయరాదని ఆలోచిస్తున్నామని లేఖలో ప్రస్తావించారు.


ఈవార్తను కూడా చదవండి: Revanth Reddy: సంక్రాంతికి వస్తున్నాం!

ఈవార్తను కూడా చదవండి: మహిళా గ్రూపులతో 231 ఎకరాల్లో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించండి: సీఎస్‌

ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: విచారణకు రండి..

ఈవార్తను కూడా చదవండి: Cybercrime: బరితెగించిన సైబర్‌ నేరగాళ్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 24 , 2024 | 01:12 PM