ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bengaluru Student: పార్టీ నుంచి ఇంటికి వెళ్తున్న యువతిపై దారుణం..

ABN, Publish Date - Aug 18 , 2024 | 04:24 PM

బెంగళూరులోని సిటీ కాలేజీలో బాధితురాలు డిగ్రీ చివర సంవత్సరం చదువుతుందని ఈస్ట్ జోన్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమణ్ గుప్తా వెల్లడించారు. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి.. ఆమెపై నేరపూరితంగా దాడి చేశాడని తెలిపారు. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేశారని ఏసీపీ వివరించారు. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

బెంగళూరు, ఆగస్ట్ 18: బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. కోరమంగళలో గెట్ టూ గెదర్ పార్టీకి హాజరై.. హెబ్బగోడిలోని తన ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో సిటీ కాలేజీ విద్యార్థిని లైంగిక దాడికి గురైంది. బైక‌్‌పై లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి.. మార్గ మధ్యంలో ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ క్రమంలో ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: Mohanlal: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మోహన్‌లాల్


బెంగళూరులోని సిటీ కాలేజీలో బాధితురాలు డిగ్రీ చివర సంవత్సరం చదువుతుందని ఈస్ట్ జోన్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమణ్ గుప్తా వెల్లడించారు. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి.. ఆమెపై నేరపూరితంగా దాడి చేశాడని తెలిపారు. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేశారని ఏసీపీ వివరించారు. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడికి సంబంధించి.. సమాచారాన్ని అంతా సేకరించామన్నారు.

Also Read: J&K Assembly polls: కిషన్‌రెడ్డి అధ్యక్షతన నేడు కీలక భేటీ


నిందితుడి కోసం 5 బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అలాగే ఘటన జరిగిన ప్రాంతాన్ని సైతం పోలీసుల బృందం సందర్శించింది. బాధితురాలి కుటుంబ సభ్యులను పోలీసులు కలిసి మాట్లాడారు. నిందితుడిని సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు స్పష్టం చేశారు.


మరోవైపు కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ వైద్యురాలిపై లైంగిక దాడి జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా వైద్యులంతా ఆందోళనకు దిగారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి కోల్‌కతా హైకోర్టు అప్పగించిన సంగతి తెలిసిందే.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 18 , 2024 | 04:31 PM

Advertising
Advertising
<