Bengaluru: నీటి ఛార్జీల పెంపు.. ఎంతంటే..?
ABN, Publish Date - Aug 23 , 2024 | 07:26 PM
బెంగళూర్ ప్రజలకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇవ్వబోతుంది. త్వరలో మంచి నీటి ధరల పెంపు ఉండనుంది. ఈ మేరకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటన చేశారు. బెంగళూర్ వాటర్ సప్లై అండ్ సివెజ్ బోర్డు నష్టాల్లో ఉందని వివరించారు. ఆర్థిక నష్టాలను తగ్గించేందుకు నీటిపై పన్ను విధించడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదన్నారు.
బెంగళూర్: బెంగళూర్ ప్రజలకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇవ్వబోతుంది. త్వరలో మంచి నీటి ధరల పెంపు ఉండనుంది. ఈ మేరకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) ప్రకటన చేశారు. బెంగళూర్ వాటర్ సప్లై అండ్ సివెజ్ బోర్డు నష్టాల్లో ఉందని వివరించారు. ఆర్థిక నష్టాలను తగ్గించేందుకు నీటిపై పన్ను విధించడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదన్నారు.
20 నుంచి 30 శాతం
వాటర్ చార్జీ 20 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ‘బెంగళూర్‌లో మంచి నీరు రాకుంటే ప్రజలు మమ్మల్ని తిడతారు. మేసెజ్, ఫోన్ చేసి మరి వేధిస్తారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బెంగళూర్‌లో నీటి ఛార్జీలు పెంచడం తప్ప మరో మార్గం లేదు. అలా అయితేనే సంస్థ మనగలుగుతుంది. నీటి బిల్లు పెంపునకు సంబంధించి నన్ను విమర్శించినా ఫర్లేదు అని’ డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
13 ఏళ్ల నుంచి నో..
గత 12- 13 ఏళ్ల నుంచి బెంగళూర్‌లో నీటి ఛార్జీలు పెంచలేదని డీకే శివకుమార్ గుర్తుచేశారు. ప్రస్తుతం బీడబ్ల్యూఎస్ఎస్బీ ఆర్థిక కష్టాల్లో ఉంది. నష్టాలను పూడ్చే క్రమంలో చార్జీ పెంచాల్సి వస్తోంది. మీ ఇంటి వద్దకు కావేరి నీరు ప్రచార కార్యక్రమాన్ని డీకే శివకుమార్ శుక్రవారం నాడు ప్రారంభించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఒకవేళ ఛార్జీలు పెంచకుంటే సంస్థ ఉనికి కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. కరెంట్ బిల్లులు, సంస్థ నిర్వహణ భారం, ఉద్యోగుల జీతభత్యాల ఇవ్వడం మరింత కష్టం అవుతుందని అభిప్రాయ పడ్డారు.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 23 , 2024 | 07:27 PM