ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bengaluru : ఏమిటీ ముడా స్కామ్‌ ?

ABN, Publish Date - Aug 18 , 2024 | 04:26 AM

మైసూరులో దశాబ్దాల క్రితం సిటీ ఇంప్రూవ్‌మెంట్‌ ట్రస్టు బోర్డు (సీఐటీబీ) ఉండగా.. దాని స్థానంలో 1987లో మైసూరు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ముడా) ఏర్పడింది. సీఎం సిద్దరామయ్య బావమరిది మల్లికార్జునస్వామి కెసరె గ్రామం సర్వే నం.464లో ఉన్న 3.16 ఎకరాల వ్యవసాయ భూమిని 2004లో కొనుగోలు చేశారు.

(బెంగళూరు-ఆంధ్రజ్యోతి)

మైసూరులో దశాబ్దాల క్రితం సిటీ ఇంప్రూవ్‌మెంట్‌ ట్రస్టు బోర్డు (సీఐటీబీ) ఉండగా.. దాని స్థానంలో 1987లో మైసూరు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ముడా) ఏర్పడింది. సీఎం సిద్దరామయ్య బావమరిది మల్లికార్జునస్వామి కెసరె గ్రామం సర్వే నం.464లో ఉన్న 3.16 ఎకరాల వ్యవసాయ భూమిని 2004లో కొనుగోలు చేశారు.

సదరు భూమిని మల్లికార్జునస్వామి మైసూరుకు చెందిన నింగాబింగ్‌ జౌరా చిన్న కుమారుడు దేవరాజ్‌ నుంచి కొనుగోలు చేసినట్లు రికార్డులు ఉన్నాయి. అది దేవరాజ్‌ పిత్రార్జితం. కాగా, మల్లికార్జునస్వామి ఆడపడుచు లాంఛనంగా, సిద్దరామయ్య భార్య పార్వతికి దానవిక్రయం చేశారు. సదరు భూమిని ముడా స్వాధీనం చేసుకుని, పార్కు ఏర్పాటు చేసింది. పరిహారంగా ఆమెకు 14 ఇళ్ల స్థలాలు కేటాయించింది.

ముడాలో వేలాది స్థలాలు ఖాళీగా ఉన్నాయి. కానీ, సిద్దరామయ్య అభివృద్ధి చెందిన విజయనగర లే అవుట్‌లో ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యేగా ముడాకు రాసిన సిఫారసు లేఖను జేడీఎస్‌ ఇటీవలే బహిర్గతం చేసింది.

ప్రస్తుతం ఈ ఇంటి స్థలాల విలువ రూ.70 కోట్లకుపైగానే పలుకుతోంది. తమ భూమి స్వాధీనం చేసుకున్నందుకు 50:50 నిష్పత్తిలో ఇంటి స్థలాలు దక్కాయని, ఇందులో ఎక్కడా అవినీతి, అక్రమం లేదని పలు సందర్భాల్లో సిద్దరామయ్య వివరణ ఇచ్చారు. కెసర పరిధిలో ఇప్పటికీ చదరపు అడుగు రూ.2-3 వేలు పలుకుతుండగా, విజయనగర్‌ లే అవుట్‌లో రూ.10-12 వేల వరకూ ధర పలుకుతున్న ఇంటి స్థలాలను సిద్దరామయ్య పొందారని, సదరు భూములు దళితులకు చెందినవని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌ ఆరోపిస్తున్నాయి.


గవర్నర్‌కు ఫిర్యాదులతో..

ముడా ఇంటి స్థలాలను అక్రమంగా పొందిన సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూట్‌ చేయాలని సామాజిక కార్యకర్త టీజే అబ్రహాం, మైసూరుకు చెందిన మరో సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ, బెంగళూరు నాగరభావి నివాసి ప్రదీప్‌ కుమార్‌ రాజ్‌భవన్‌కు ఫిర్యాదులు చేశారు.

జూలై 26న టీజే అబ్రహాం సమగ్ర వివరాలతో గవర్నర్‌ను కలిసి ప్రాసిక్యూషన్‌ కోరారు. ఆ మరుసటి రోజే సీఎం సిద్దరామయ్యకు గవర్నర్‌ నోటీసులు జారీ చేశారు. కాగా, ముడా ఇంటిస్థలాల అక్రమంలో సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూట్‌ చేయాలని గవర్నర్‌ అనుమతులు ఇవ్వడంతో 2011 నాటి ఘటన పునరావృతమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అప్పటి సీఎం యడియూరప్ప డీ నోటిఫికేషన్‌లో అక్రమాలకు పాల్పడ్డారని న్యాయవాది సిరాజిన్‌ బాషా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నాటి గవర్నర్‌ హంసరాజ్‌ భరద్వాజ్‌ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చారు.

Updated Date - Aug 18 , 2024 | 04:26 AM

Advertising
Advertising
<