Delhi Air Port: విమానం అత్యవసర ల్యాండింగ్
ABN, Publish Date - May 17 , 2024 | 08:25 PM
న్యూఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
న్యూఢిల్లీ, మే 17: న్యూఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ మేరకు న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 6.00 గంటలకు ఎయిర్ ఇండియా AI 807 విమానం న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి బెంగళూరు బయలుదేరిందని తెలిపారు.
AP Elections: విజయసాయిరెడ్డికి ఏమైంది..?
అయితే విమానంలోని ఎయిర్ కండిషన్ యూనిట్‌లో నిప్పులు వచ్చాయన్నారు. ఈ విషయాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులకు విమానంలోని సిబ్బంది తెలిపారు. దీంతో విమానం బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌కు విమానం తిరిగి వచ్చిందని చెప్పారు. బెంగళూరు బయలుదేరిన ఈ విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు.
Aam Aadmi Party: స్వాతి మలివాల్‌కు వైద్య పరీక్షలు: గాయాలు
మరోవైపు పుణే ఎయిర్ పోర్ట్‌లో ఎయిర్ ఇండియా విమానానికి తృటీలో ప్రమాదం తప్పింది. పుణే నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న విమానం రన్ వేపై లగేజ్ ట్రక్క్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 17 , 2024 | 08:25 PM