ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bharat Ratna 2024: 'భారతరత్న' అందుకున్న ఎల్‌కే అడ్వాణీ

ABN, Publish Date - Mar 31 , 2024 | 03:29 PM

భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్‌కృష్ణ అడ్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ''భారత రత్న'' ప్రదానం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆదివారం ఉదయం స్వయంగా అడ్వాణీ ఇంటికి వెళ్లి ఈ అవార్డును అందజేశారు.

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్‌కృష్ణ అడ్వాణీ (LK Advani)కి దేశ అత్యున్నత పౌర పురస్కారం ''భారత రత్న'' (Bharat Ratna) ప్రదానం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆదివారం ఉదయం స్వయంగా అడ్వాణీ ఇంటికి వెళ్లి ఈ అవార్డును అందజేశారు. వయోభారం, అనారోగ్యం కారణంగా శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవానికి అడ్వాణీ హాజరుకాలేకపోయారు. దీంతో రాష్ట్రపతి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పురస్కారాన్ని అందజేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


పార్టీ వ్యవస్థాపకులలో ఒకరిగా, అగ్రనేతగా..

బీజేపీ వ్యవస్థాపకులలో ఒకరిగా, పార్టీ టాలెస్ట్ లీడర్‌గా అడ్వాణీకి విశిష్ట స్థానం ఉంది. 1990లో అడ్వాణీ చేపట్టిన రథయాత్ర బీజేపీని జాతీయ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న కరాచీలో 1927 నవంబర్ 8న జన్మించిన అడ్వాణీ 14 ఏళ్లలో అర్ఎస్ఎస్‌లో చేరి కరాచీ విభాగం కార్యదర్శిగా కూడా పనిచేశారు. దేశ విభజన తర్వాత ముంబైలో స్థిరపడ్డారు. రాజస్థాన్‌లో సంఘ్ ప్రచారక్‌గా, ఢిల్లీలో జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జన్‌సంఘ్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. 1970లో తొలిసారి ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1980లో వాజ్‌పేయితో కలిసి బీజేపీని స్థాపించారు. 1998లో గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీచేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. బీజేపీ ప్రభుత్వంలో రెండు సార్లు కేంద్ర హోం మంత్రిగా పనిచేశారు. 2002లో ఉప ప్రధాని పదవిని చేపట్టారు. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమితో ఆయన లోక్‌సభలో విపక్ష నేతగా పనిచేశారు. 2014లో గాంధీనగర్ నుంచి తిరిగి గెలుపొందిన ఆయన 2019 నుంచి క్రియాశీలక రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 31 , 2024 | 03:29 PM

Advertising
Advertising