Share News

Delhi excise policy case: సుప్రీంకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ

ABN , Publish Date - Jun 24 , 2024 | 04:12 PM

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు విధించిన స్టేను సవాలు చేస్తూ సుప్రీకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను జూన్ 26 వరకు వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.

Delhi excise policy case: సుప్రీంకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు విధించిన స్టేను సవాలు చేస్తూ సుప్రీకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను జూన్ 26 వరకు వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. దీంతో కేజ్రీవాల్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఈ కేసును ఢిల్లీ హైకోర్టు ‘అసాధారణ పద్ధతి’లో నిర్వహించినట్టు గుర్తించామని కోర్టు వ్యాఖ్యానించింది. అదే రోజున తీర్పు చెప్పకుండా హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసిందని సర్వోన్నత న్యాయస్థానం ప్రస్తావించింది. అయితే తుది ఉత్తర్వులు రాకముందే దానిపై స్టే విధించి అదే ఆరోపిత తప్పును చేయబోమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కారణంగానే విచారణను వాయిదా వేసింది.


కాగా ఢిల్లీ కేసులో ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ వచ్చింది. అయితే బెయిల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు స్టే విధించింది. హైకోర్ట్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Updated Date - Jun 24 , 2024 | 04:15 PM