ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bihar: రూ.20 లంచం తీసుకున్న మాజీ పోలీసును అరెస్టు చేయండి

ABN, Publish Date - Sep 07 , 2024 | 05:36 AM

కూరగాయలు అమ్ముకొనే మహిళ నుంచి 34 ఏళ్ల క్రితం రూ.20 లంచం తీసుకున్న మాజీ పోలీసు కానిస్టేబుల్‌ను అరెస్టు చేయాలని బిహార్‌లోని స్పెషల్‌ విజిలెన్స్‌ కోర్టు గురువారం డీజీపీని ఆదేశించింది.

  • బెయిల్‌ తీసుకొని 25 ఏళ్లుగా పరార్‌

  • 34 ఏళ్ల నాటి ఘటనలో విజిలెన్స్‌ కోర్టు తాజా ఆదేశం

పట్నా, సెప్టెంబరు 6: కూరగాయలు అమ్ముకొనే మహిళ నుంచి 34 ఏళ్ల క్రితం రూ.20 లంచం తీసుకున్న మాజీ పోలీసు కానిస్టేబుల్‌ను అరెస్టు చేయాలని బిహార్‌లోని స్పెషల్‌ విజిలెన్స్‌ కోర్టు గురువారం డీజీపీని ఆదేశించింది. ఈ కేసులో ఆయనకు ఇచ్చిన బెయిల్‌ రద్దయినా 25 ఏళ్లుగా పరారీలో ఉంటూ కోర్టుకు హాజరు కాకపోవడంతో మళ్లీ అరెస్టు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. సురేష్‌ ప్రసాద్‌ సింగ్‌ అనే కానిస్టేబుల్‌ గతంలో సహర్స రైల్వే స్టేషన్‌లో విఽధులు నిర్వర్తించేవాడు. 1990 మే ఆరో తేదీన ఓ మహిళ నుంచి రూ.20 లంచం తీసుకున్నాడు.


అతనిపై కేసు నమోదు కాగా, అనంతరం బెయిల్‌ మంజూరయింది. అయితే 1999 నుంచి అతను పరారీలో ఉండడంతో బెయిల్‌ రద్దయింది. ఆస్తులను జప్తు చేస్తున్నట్టు నోటీసు ఇచ్చినా స్పందించలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయగా సర్వీసు రికార్డులో నమోదుకు తప్పుడు చిరునామా ఇచ్చినట్టు తేలింది. పోలీసుల అవినీతిపై పెండింగ్‌ కేసులను ఇటీవల పరిశీలించిన స్పెషల్‌ విజిలెన్స్‌ జడ్జి సుదేశ్‌ శ్రీవాస్తవ ఈ కేసును గుర్తించారు. పరారీలో ఉన్న మాజీ కానిస్టేబుల్‌ను అరెస్టు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు.

Updated Date - Sep 07 , 2024 | 05:37 AM

Advertising
Advertising