ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP: ముగిసిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం.. కీలక విషయాలేంటంటే....

ABN, Publish Date - Mar 01 , 2024 | 07:05 AM

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం ముగిసింది. ఈ సమావేశం ఐదు గంటల పాటు కొనసాగింది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తెలంగాణ సహా మొత్తం 9 రాష్ట్రాల్లో లోక్‌సభ అభ్యర్థులపై కసరత్తు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 125కు పైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.

ఢిల్లీ: బీజేపీ (BJP) కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం (CEC Meeting) ముగిసింది. ఈ సమావేశం ఐదు గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పాల్గొన్నారు. తెలంగాణ (Telangana) సహా మొత్తం 9 రాష్ట్రాల్లో లోక్‌సభ (Loksabha) అభ్యర్థులపై కసరత్తు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 125కు పైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. అభ్యర్థుల తొలి జాబితాను లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ కంటే మునుపే బీజేపీ ప్రకటించనుంది.

బలహీన స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చ..

సీఈసీ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), ప్రధాని మోదీ, అమిత్ షా (Amit Shah), రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) సహా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath), మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గోవా సీఎం ప్రమోద్ సావంత్ సహా ఆయా రాష్ట్రల ముఖ్య నేతలు పాల్గొన్నారు. అలాగే ఈ సమావేశంలో 2014,2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాలు, బీజేపీ బలహీనంగా ఉన్న స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగినట్లు సమాచారం.

తెలంగాణ నుంచి ఆరేడు స్థానాలు..

తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ (BJP) తరఫున లోక్‌సభకు పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు తుది దశకు చేరింది. దేశవ్యాప్తంగా 125 పైగా స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను నేడు ప్రకటించే అవకాశం ఉంది. అందులో తెలంగాణ నుంచి ఆరేడు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఉన్నట్టు తెలిసింది. ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌లు తరుణ్‌ చుగ్‌ (Tarun Chug), సునీల్‌ బన్సల్‌ (Sunil Bansal)తోపాటు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి (Kishan Reddy), ఎంపీలు లక్ష్మణ్‌, బండి సంజయ్‌ (Bandi Sanjay).. డీకే అరుణ, ఈటల రాజేందర్‌, జితేందర్‌ రెడ్డి, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి హాజరయ్యారు.

ఆదిలాబాద్ మినహా మూడు స్థానాలకు..

రాష్ట్రంలో బీజేపీకి నాలుగు సిటింగ్‌ ఎంపీ స్థానాలు ఉండగా.. ఆదిలాబాద్‌ మినహా మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించనున్నట్టు సమాచారం. కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌, నిజామాబాద్‌ నుంచి ధర్మపురి అర్వింద్‌, సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి పేర్లుంటాయని తెలిసింది. అదేవిధంగా బీఆర్‌ఎస్‌ నుంచి గురువారమే బీజేపీలో చేరిన ఎంపీ రాములు లేదా ఆయన కుమారుడిని నాగర్‌కర్నూల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మొదటి జాబితాలోనే ప్రకటించే అవకాశముంది. మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌ స్థానాలపైనా కేంద్ర ఎన్నికల కమిటీ చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలిసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2024 | 07:22 AM

Advertising
Advertising