మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల
ABN, Publish Date - Oct 21 , 2024 | 03:25 AM
నవంబరు 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది.
ముంబై, అక్టోబరు 20: నవంబరు 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన ఈ జాబితాలో 99 మంది పేర్లు ఉన్నాయి. ఇందులో 71 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలే. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు ఉండగా... బీజేపీ 151 సీట్లకు పోటీ చేయనుంది. మిగిలిన సీట్లకు బీజేపీ మిత్రపక్షాలు శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం పోటీ చేయనున్నాయి. బరిలో దిగనున్న ప్రముఖుల్లో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, స్పీకర్ రాహుల్ నర్వేకర్ తదితరులున్నారు. బీజేపీ తొలి జాబితాలో 13 మంది మహిళలకు సీటు దక్కింది. అలాగే షెడ్యూల్ తెగలకు చెందినవారికి ఆరు, షెడ్యూలు కులాలకు నాలుగు సీట్లు కేటాయించారు.
Updated Date - Oct 21 , 2024 | 03:25 AM