ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: బీజేపీ ఎన్నికల మిషన్ కాదు: మోదీ

ABN, Publish Date - Sep 02 , 2024 | 08:53 PM

బీజేపీ ఎన్నికల మిషన్ కాదని, అలా చెప్పడం పార్టీని అవమాన పరచడమేనని, పార్టీ కార్యకర్తల కృషి, ధైర్యం ఫలితంగానే ఎన్నికల్లో గెలుపు ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జాతి కలలను తీర్మానాలుగా రూపొందించుకుని, వాటిని సాధించడం, అందుకోసం పూర్తి అంకితభావంతో పనిచేయడం చేయాలన్నారు.

న్యూఢిల్లీ: బీజేపీ ఎన్నికల మిషన్ కాదని, అలా చెప్పడం పార్టీని అవమాన పరచడమేనని, పార్టీ కార్యకర్తల కృషి, ధైర్యం ఫలితంగానే ఎన్నికల్లో గెలుపు ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. జాతి కలలను తీర్మానాలుగా రూపొందించుకుని, వాటిని సాధించడం, అందుకోసం పూర్తి అంకితభావంతో పనిచేయడం చేయాలన్నారు. ఏ పార్టీని ప్రజలు అధికారంలోకి తీసుకువచ్చారో ఆ పార్టీ ప్రజాస్వామిక విలువలకు కట్టుబడుతూ, అంతర్గత ప్రజాస్వామ్యానని కాపాడుకోవాకోవాల్సి ఉంటుందన్నారు. పార్టీకి (BJP) ఎన్నో తరాలవారు తమ జీవితాలను వెచ్చించారని, ఆ ఫలితమే ఈరోజు ప్రజల గుండెల్లో కమలం చిరస్థాయిగా నిలిచిందని గుర్తుచేశారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం- 'సంఘటన్ పర్వ, సదస్యత అభియాన్ 2024' కార్యక్రమాన్ని సోమవారంనాడు ప్రారంభించిన అనంతరం కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ప్రధాని ప్రసంగించారు.


''మరో విడత సదస్యత అభియాన్ ఈరోజు ప్రారంభమైంది. భారతీయ జన సంఘ్ నుంచి ఇప్పటి వరకూ దేశంలో నూతన రాజకీయ సంస్కృతిని తెచ్చేందుకు సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చాం. ఏ సంస్థకు, పార్టీకి ప్రజలు పట్టంగట్టారో ఆ పార్టీ ప్రజాస్వామిక విలువలను పాటించకుంటే, అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే ఇవాళ పలు పార్టీలు ఎదుర్కొంటున్న పరిస్థితినే ఆ పార్టీ కూడా ఎదుర్కోవలసి వస్తుంది. బీజేపీ కోసం ఎన్నో తరాలు తమ జీవితాలను వెచ్చించారు. వారి కృషి కారణంగానే ఇవాళ ప్రజల గుండెల్లో కమలం పార్టీ సుస్థిర స్థానం సంపాదించుకుంది'' అని ప్రధాని పేర్కొన్నారు.

PM Modi: బీజేపీ జాతీయ సభ్యత్వ నమోదును ప్రారంభించిన మోదీ


గోడలపై కమలం పెయింట్లు వేశా..

పార్టీ తొలినాళ్లలో గోడలపై తాను కమలం పెయింట్స్ వేశానని, జన హృదయాల్లో ఒకనాటికి కమలం వికసిస్తుందనే గట్టి నమ్మకం తనకు ఉండేదని ప్రధాని తెలిపారు. తాను రాజకీయాల్లోకి రానప్పుడు జనసంఘ్ సమయంలో ఉత్సాహవంతులైన కార్యకర్తలు గోడలపై దీపాల పెయింట్స్ వేసేవారని, గోడలపై దీపాల పెయింట్స్ వేస్తే అధికారంలోకి వస్తారా అంటూ పలు పార్టీల నేతలు తమ ప్రసంగంల్లో పరిహసించే వారని గుర్తు చేశారు. అయితే తాము ఎంతో అంకితభావంతో కమలం గుర్తును గోడలపై పెయింట్ వేసేవాళ్లమని, గోడలపై లోటస్ ప్రజల గుండెల్లో నిలిచిపోతుందనే నమ్మకమే అందుకు కారణమని చెప్పారు.


సభ్యత్వ నమోదు అంటే కుటుంబ విస్తరణే..

బీజేపీ కుటుంబ విస్తరణే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమమని, ఇది కేవలం ఒక తంతు కాదని మోదీ చెప్పారు. ఇది అంకెల గేమ్ కాదని, సంఖ్యాబలం ఎంతుందనేది కూడా కాదని చెప్పారు. సభ్యత్వ నమోదు అనేది సైద్ధాంతిక, భావోద్వేగ ఉద్యమమని చెప్పారు.

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 02 , 2024 | 08:53 PM

Advertising
Advertising