ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodhya: బాబర్ సమాధి వద్ద రాహుల్ గాంధీ.. కాంగ్రెస్‌ తీరుపై బీజేపీ ఘాటు విమర్శలు

ABN, Publish Date - Jan 12 , 2024 | 11:47 AM

అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం బీజేపీ- కాంగ్రెస్ మధ్య అగ్గిరాజేసింది. హాజరుకాబోమని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తీరును అసోం సీఎం హిమంత బిశ్వ శర్వ తప్పుపట్టారు.

అయోధ్య: అయోధ్యలో (Ayodhya Ram Mandir) రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం బీజేపీ- కాంగ్రెస్ మధ్య అగ్గిరాజేసింది. కార్యక్రమానికి హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు స్వయంగా ఆహ్వానించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమం అని, రాలేమని కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. కాంగ్రెస్ పార్టీ తీరును అసోం సీఎం హిమంత బిశ్వ శర్వ తప్పుపట్టారు.

బాబర్ సమాధి వద్ద రాహుల్

బాబర్ సమాధి వద్ద రాహుల్ గాంధీ ఉన్న ఫొటోను హిమంత శర్మ షేర్ చేశారు. ‘రాహుల్ ఒక్కరే కాదు, మూడు తరాల నేతలు బాబర్ సమాధిని సందర్శించారు. హిందువులు అంటే వారికి అంత ద్వేషం ఎందుకు..? రామ్ లల్లా అంటే విద్వేషంతో ఎందుకు ఉన్నారు’ అని ట్వీట్‌ చేశారు. 2005లో రాహుల్ గాంధీ ఆప్ఘనిస్థాన్ వెళ్లిన సమయంలో రాహుల్ గాంధీ ఫొటో దిగారు. ఆ ఫొటోను హిమంత శర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

భక్తిపై రాజకీయాలు

హిమంత శర్మ తీరును కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ‘ఆలయం, మసీదుకు వెళ్లడం అనేది ఒకరి ఇష్టానికి సంబంధించిన అంశం. దానిని బీజేపీ ఎందుకు రాజకీయం చేస్తుంది. భక్తిని రాజకీయం చేయడం సరికాదు’ అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ ఘడ్ కౌంటర్ ఇచ్చారు.

11 వేల మంది అతిథులు

అయోధ్యలో ఈ నెల 22వ తేదీన రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. 11 వేల మంది అతిథులను ట్రస్ట్ సభ్యులు స్వయంగా ఆహ్వానించారు. అయోధ్యకు ప్రత్యేక విమానాలు, రైళ్లు కూడా నడుస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 12 , 2024 | 11:47 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising