ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP state president: రాజకీయాల కంటే పోలీస్‌ ఉద్యోగమే మంచిది..

ABN, Publish Date - Jul 24 , 2024 | 12:42 PM

రాజకీయాల కంటే పోలీస్‌ ఉద్యోగమే మేలనిపిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగాలా? వద్దా? అనే ఆలోచన కూడా వస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై(Bharatiya Janata Party state president K. Annamalai) తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

- పాలిటిక్స్‌లో కొనసాగాలా? వద్దా? అనే ఆలోచన వస్తోంది

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై నిర్వేదం

చెన్నై: రాజకీయాల కంటే పోలీస్‌ ఉద్యోగమే మేలనిపిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగాలా? వద్దా? అనే ఆలోచన కూడా వస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై(Bharatiya Janata Party state president K. Annamalai) తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో తన విజయం కోసం కృషి చేసిన అనుచరులు, సన్నిహితులతో ఆయన సమావేశం నిర్వహించి, వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన తన మనసులోని మాట చెప్పినట్లు తెలిసింది. గత మూడేళ్ళుగా రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ అనేక విషయాలు నేర్చుకున్నట్టు చెప్పారు.

ఇదికూడా చదవండి: Railway Budget : రైల్వేకు రూ.2.62 లక్షల కోట్లు


‘‘రాజకీయ నేతగా ఇది నాకెంతో కష్టకాలం. ఎన్నో కష్టనష్టాలను ఓర్చి ఈ కుర్చీలో వున్నాను. ఇలాంటి రాజకీయాల్లో మనం కొనసాగాలా? వద్దా? అనే ఆలోచన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయాల కంటే పోలీసు ఉద్యోగమే ఎంతో సులభం. పోలీస్‌ శాఖ(Police Department)లో బ్లాక్‌ అండ్‌ వైట్‌ అనే రెండు మాత్రమే ఉంటాయి. ఒక నిందితుడు తప్పు చేశాడా లేదా? అన్నదే ముఖ్యం. ఈ విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. కానీ, రాజకీయాల్లో కొనసాగాలంటే అనేక విషయాల్లో రాజీ పడాల్సి వుంది. ఇక్కడ సాధారణ వ్యక్తిగా మాట్లాడేందుకు వీలుండదు. సొంత పార్టీ నేతలే అసత్యాలు చెప్పినా వాటిని భరించాల్సిన దుస్థితి. రాజకీయాల్లో విజయం సాధించాలంటే ఎంతగానో శ్రమించాల్సి వుంది.

ఇదికూడా చదవండి: కాపీకొట్టినందుకు చాలా సంతోషం


ప్రజాస్వామ్యంలో అనేక సందర్భాల్లో నిర్వేదం ఆవహిస్తోంది. కొన్నిమార్లు నా వ్యవహారశైలి కూడా మీతో పాటు అనేక మందికి ఆగ్రహం కలిగించి వుంటుంది. అన్ని వేళల్లో కత్తి పట్టుకుని ముందుకు వెళ్లలేం. కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేయాల్సి ఉంటుంది. ఎల్లవేళలా టాప్‌గేర్‌(Topgear)లో డ్రైవింగ్‌ చేస్తే గేర్‌ బాక్స్‌ చెడిపోతుంది. ఫాస్ట్‌ గేర్‌లో వెళితే కారు మరమ్మతులకు గురవుతుంది. అవసరమైన సమయంలో అవసరమైన గేర్‌లో డ్రైవింగ్‌ చేయాలి. 2026 ఎన్నికలకు మనమంతా ఐదో గేర్‌లో ప్రయాణించాల్సి ఉంటుంది. కోయంబత్తూరులో నాకు విజయం కాస్త దూరమైందంతే. అక్కడ 4.5 లక్షల ఓట్లు పొందడం గొప్ప విషయం. రాజకీయాల్లో ఉన్నపుడు సమస్యలు రావడం సహజమే. మంచి వారికే కష్టాలు ఎదురవుతాయి. నేను తప్పు చేసినా ఽధైర్యంగా ప్రశ్నించండి’’ అంటూ అన్నామలై సూచించినట్లు తెలిసింది.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 24 , 2024 | 12:42 PM

Advertising
Advertising
<