BJP: గవర్నర్‌ను అవమానిస్తారా..? సీఎం రాజీనామా చేసే దాక ఆందోళన విరమించేది లేదు
ABN, Publish Date - Aug 23 , 2024 | 12:16 PM
రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్ పట్ల అవమానం చేసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని, ముఖ్యమంత్రి రాజీనామా చేసేదాకా ఆందోళనలు విరమించేది లేదని పరిషత్ ప్రతిపక్షనేత చలవాది నారాయణస్వామి(Chalavadi Narayanaswamy) పేర్కొన్నారు.
- పరిషత్ ప్రతిపక్షనేత చలవాది నారాయణస్వామి
- కాంగ్రెస్ తీరుకు నిరసనగా బీజేపీ ఆందోళన
బెంగళూరు: రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్ పట్ల అవమానం చేసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని, ముఖ్యమంత్రి రాజీనామా చేసేదాకా ఆందోళనలు విరమించేది లేదని పరిషత్ ప్రతిపక్షనేత చలవాది నారాయణస్వామి(Chalavadi Narayanaswamy) పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఫ్రీడంపార్కులో గురువారం చేపట్టిన నిరసనకు మాజీ డీసీఎం అశ్వత్థనారాయణ, ఎమ్మెల్యేలు మునిరత్న, రవికుమార్, ఉమేశ్‌తోపాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలవాది నారాయణస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోని దళిత ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇదికూడా చదవండి: Bangalore: సీఎంకు అండగా ఉంటాం.. గవర్నర్ తీరు ఆక్షేపణీయం
గవర్నర్(Governor)ను అవమానించినవారిని వెనకేసుకురావడం సరికాదన్నారు. తాను బీసీ అయినందునే బీజేపీ వేధిస్తోందని సీఎం చెబుతున్నారని, అలా అయితే ప్రధానమంత్రి ఎవరని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని కొనుగోలు చేయడం న్యాయమా అన్నారు. సిద్దరామయ్య(Siddaramaiah) దళితులకు కేటాయించిన గ్రాంట్లను ఇతర ప్రయోజనాలకు ఉపయోగించారని, ముడా భూములు దళితులకు చెందినవని, వాల్మీకి కార్పొరేషన్‌లో ఎవరి కోసం కేటాయించిన గ్రాంట్లను అక్రమంగా బదిలీ చేశారని ప్రశ్నించారు. బెళగావి, హుబ్బళ్ళితోపాటు పలు ప్రాంతాలలో ఆందోళన చేశారు.
.......................................................................
ఈ వార్తను కూడా చదవండి:
........................................................................
Bangalore: హెబ్బాళ నుంచి సిల్క్‌బోర్డ్‌కు సొరంగ మార్గం
- బీజేపీ-జేడీఎస్ నేతల పాతకేసుల్లో ప్రాసిక్యూషన్
- కేబినెట్‌లో పలు తీర్మానాలు
బెంగళూరు: నగరంలో నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు హెబ్బాళ నుంచి సిల్క్‌బోర్డు దాకా సొరంగమార్గం నిర్మాణాలకు కేబినెట్ తీర్మానించింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ తీర్మానాలను న్యాయ, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ మీడియాకు తెలిపారు. హెబ్బాళ(Hebbala)లోని ఎస్టీమ్ మాల్ నుంచి సిల్క్‌బోర్డు దాకా 18 కిలోమీటర్ల మేర సొరంగమార్గంలో నిర్మాణానికి సాంకేతికంగా అంగీకరించామని తెలిపారు.
ఇందుకు రూ.12,690 కోట్లు ఖర్చు కానుందని అంచనా వేశామన్నారు. డీపీఆర్ సిద్ధం కావాల్సి ఉందన్నారు. బెంగళూరులో పర్యాటకులను ఆకర్షించేందుకు రూ.500 కోట్లతో స్కైడెక్ నిర్మాణానికి తీర్మానించామని తెలిపారు. నగరం నుంచి ఎయిర్‌పోర్ట్(Airport)కు వెళ్లే మార్గం సహజంగానే ట్రాఫిక్ ఉంటుందని, ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్, గ్రేట్ సపరేటర్లు నిర్మించినా ఒత్తిడి తగ్గడంలేదన్నారు. దీంతో సొరంగ మార్గ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. తొలి విడతగా ఎస్టీమ్ మాల్ నుంచి మేఖ్రి సర్కిల్‌కు 3 కిలోమీటర్ల మేర నిర్మిస్తామని పేర్కొన్నారు. రెండో విడతలో సిల్క్‌బోర్డ్ వరకు విస్తరింపచేసే ఆలోచన ఉందన్నారు.
చైనాలోని షాంఘైలో షాంఘై టవర్, ఆస్ట్రియాలో కూప్ హిమ్మల్బ్ సంస్థ, వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్, స్కైడెక్ నిర్మాణాలు జరిపిందన్నారు. బెంగళూరుకు వచ్చే ప్రయాణికులు, సందర్శకులకు ప్రత్యేకమైన ‘స్కైడెక్’ ఆకర్షణీయం కానుందన్నారు. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండే బీజేపీ, జేడీఎస్(BJP, JDS) కీలకనేతల వివాదాలపై ప్రాసిక్యూషన్‌కు అనుమతులు ఇవ్వాలని తీర్మానించామన్నారు. కేంద్రమంత్రి కుమారస్వామి, బీజేపీకి చెందిన మాజీ మంత్రులు మురుగేశ్ నిరాణి, శశికళ జొల్లె, గాలి జనార్దనరెడ్డిపై పెండింగ్‌లో ఉండే వివాదాల్లో రెండింటికి చార్జ్‌షీట్ దాఖలయ్యాయని మంత్రి వివరించారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి గ్రాంట్లను కేటాయిస్తూ తీర్మానించామన్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Aug 23 , 2024 | 12:24 PM