Maharashtra elections 2024: మెజారిటీ మార్క్‌ను దాటిని 'మహాయుతి'
ABN, Publish Date - Nov 23 , 2024 | 02:24 PM
శనివారంనాడు వెలువడిన 'ఎర్లీ ట్రెండ్స్' ప్రకారం మహాయుతి కూటమి మెజారిటీ మార్క్‌ను దాటింది. మొత్తం 288 స్థానాల్లో 214 స్థానాల్లో ఆ కూటమి ఆధిక్యంతో ఉంది.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ (BJP) సారథ్యంలోని 'మహాయుతి' (Mahayutiiance) కూటమి విజయం దిశగా దూసుకువెళ్తుండగా, కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడి (MVA) వెనుకబడింది. శనివారంనాడు వెలువడిన 'ఎర్లీ ట్రెండ్స్' ప్రకారం మహాయుతి కూటమి మెజారిటీ మార్క్‌ను దాటింది. మొత్తం 288 స్థానాల్లో 214 స్థానాల్లో ఆ కూటమి ఆధిక్యంతో ఉంది. ఎంవీఏ 57 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తోందని ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్- results.eci.gov.in వెల్లడించింది.
CM Eknath Shinde: మహారాష్ట్రలో భారీ విజయంపై సీఎం ఏక్ నాథ్ షిండే ఏమన్నారంటే..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగగా 66 శాతం పోలింగ్ నమోదైంది. బీజేపీ, శివసేన, ఎన్‌సీపీతో కూడిన మహాయుతి కూటమి మరోసారి అధికారంలోకి వస్తామనే బలమైన అంచనాలతో ఉండగా, కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ(ఎస్‌పీ) కూటమి ఈసారి బీజేపీ నుంచి అధికారం కైవసం చేసుకుంటామనే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగింది. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అడ్డంగా చీలిపోయిన తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.
మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకేసారి ముగియగా, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మహారాష్ట్రలో నువ్వానేనా అనే రీతిలో పోటీ ఉంటుందని అంచనా వేశాయి. మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో భాగంగా 149 స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా, 81 సీట్లలో శివసేన, 59 చోట్ల అజిత్ పవార్ ఎన్‌సీపీ పోటీ చేశాయి. ఎంవీఏలో భాగంగా కాంగ్రెస్ 101 స్థానాల్లో, శివసేన (యూబీటీ) 95 స్థానాల్లో, ఎన్‌సీపీ (ఎస్‌పీ) 86 చోట్ల పోటీ చేసింది.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan: మహారాష్ట్రలోనూ పవన్ కల్యాణ్ హవా.. పవన్ ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ దూకుడు..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Nov 23 , 2024 | 02:24 PM