ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఢిల్లీ సీఆర్పీఎఫ్‌ స్కూల్‌ వద్ద పేలుడు

ABN, Publish Date - Oct 21 , 2024 | 02:45 AM

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కలకలం రేగింది. ప్రశాంత్‌ విహార్‌ సీఆర్పీఎఫ్‌ పాఠశాల ప్రహరీ గోడ వద్ద ఉదయం 7.50 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.

  • ప్రహరీ గోడ ధ్వంసం.. దెబ్బతిన్న చుట్టుపక్కల భవనాల కిటికీలు, కార్ల అద్దాలు

  • 2 కిలోమీటర్ల వరకు వినిపించిన శబ్దం

  • ‘క్రూడ్‌ బాంబు’గా పోలీసుల అనుమానం

న్యూఢిల్లీ, అక్టోబరు 20: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కలకలం రేగింది. ప్రశాంత్‌ విహార్‌ సీఆర్పీఎఫ్‌ పాఠశాల ప్రహరీ గోడ వద్ద ఉదయం 7.50 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు కానీ పేలుడు ధాటికి ఆ గోడ దెబ్బతినడంతో పాటు సమీపంలో ఉన్న కార్లు, భవనాల కిటికీలు పగిలిపోయాయి. చెవులు చిల్లులు పడేలా వచ్చిన శబ్దం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్‌ఐఏ, ఎన్‌ఎ్‌సజీ, సీఆర్పీఎఫ్‌ సిబ్బంది, బాంబు స్క్వాడ్‌ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇంకా అక్కడేమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయోమో తనిఖీ చేయడానికి రోబోలను వినియోగించారు. ఫోరెన్సిక్‌ నిపుణులు అక్కడ తెల్లని పౌడర్‌ లాంటి పదార్థాన్ని గుర్తించి.. దాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. పేలుడుకు ‘క్రూడ్‌ బాంబు’ కారణమని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Oct 21 , 2024 | 02:45 AM