ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Breaking: ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించిన రాష్ట్రపతి ముర్ము

ABN, Publish Date - Jun 07 , 2024 | 07:11 PM

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు నరేంద్ర మోదీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. శుక్రవారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మోదీ కలిశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మోదీని ముర్ము కోరారు.

Prime Minister Narendra Modi met President Droupadi Murmu at the Rashtrapati Bhavan.

న్యూడిల్లీ, జూన్ 07: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు నరేంద్ర మోదీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. శుక్రవారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మోదీ కలిశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మోదీని ముర్ము కోరారు. అయితే జూన్ 9వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు ఎంపీలతో కేంద్రమంత్రులుగా రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Also Read: Nara Lokesh: టీడీపీ ఎప్పుడు ‘ఆ పని’ చేయదు..


మరోవైపు ఈ రోజు ఉదయం పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల ఎంపీలు సమావేశమయ్యారు. ఆ క్రమంలో తమ పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోదీని వారంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే మోదీ కేబినెట్‌లో భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి రామ్ విలాస్ పాశ్వాన్, శివసేన షిండే పార్టీలకు చెందిన ఎంపీలకు చోటు దక్కే అవకాశం ఉంది. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో బీజేపీకి కేవలం 240 స్థానాలే వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 272 స్థానాలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భాగస్వామ్య పక్షాలను కలుపుకోవడంతో.. ఎన్డీయే కూటమికి 275 సీట్లు వచ్చినట్లు అయింది.

Also Read: మోదీ ఆరోపణలు.. కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం

Also Read: అద్వానీ, జోషిల నుంచి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

Also Read: నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి

Also Read: బాలీవుడ్ మౌనంపై కంగనా రనౌత్ స్పందన

For Latest News and National News click here

Updated Date - Jun 07 , 2024 | 07:11 PM

Advertising
Advertising