ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

National: నేడు రౌస్‌ అవెన్యూ కోర్టుకు కవిత

ABN, Publish Date - Jun 03 , 2024 | 06:24 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సోమవారం ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. జ్యుడీషియల్‌ కస్టడీ ముగియనుండడంతో ఆమెను కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. కవితతోపాటు చరణ్‌ప్రీత్‌, దామోదర్‌ శర్మ, ప్రిన్స్‌ కుమార్‌, అరవింద్‌ సింగ్‌లను నిందితులుగా పేర్కొంటూ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను గత నెల 29న న్యాయమూర్తి అంగీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

  • కస్టడీ పొడిగించాలని కోరనున్న దర్యాప్తు సంస్థలు!

న్యూఢిల్లీ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సోమవారం ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. జ్యుడీషియల్‌ కస్టడీ ముగియనుండడంతో ఆమెను కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. కవితతోపాటు చరణ్‌ప్రీత్‌, దామోదర్‌ శర్మ, ప్రిన్స్‌ కుమార్‌, అరవింద్‌ సింగ్‌లను నిందితులుగా పేర్కొంటూ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను గత నెల 29న న్యాయమూర్తి అంగీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కవిత, చరణ్‌ప్రీత్‌లు ఇప్పటికే జ్యుడీషియల్‌ కస్టడీలో ఉండడంతో వారికి న్యాయస్థానం ప్రొడక్షన్‌ వారెంట్లు జారీ చేసింది.

దామోదర్‌ శర్మ, ప్రిన్స్‌ కుమార్‌, అరవింద్‌ సింగ్‌లను జూన్‌ 3న కోర్టు ముందు హాజరు పర్చాలని ఆదేశించింది. అయితే, కవిత జ్యుడీషియల్‌ కస్టడీ కూడా 3తోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో కవితతోపాటు మిగిలిన వారిని సోమవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగియగా, న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. మే నెలాఖరులోనే తీర్పు వస్తుందని ఆశించినప్పటికీ, రాలేదు. జూన్‌ నెలాఖరు వరకు హైకోర్టుకు సెలవులు కావడంతో ఆమె ఈ నెలంతా జైల్లోనే ఉండనున్నారు.

Updated Date - Jun 03 , 2024 | 06:24 AM

Advertising
Advertising