Nirmala Sitharaman: 2009 బడ్జెట్‌లో 26 రాష్ట్రాల పేర్లు ప్రస్తావించ లేదు..
ABN, Publish Date - Jul 30 , 2024 | 09:15 PM
ఈనెల 23న పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో విపక్ష పాలిత రాష్ట్రాలపై నిర్లక్ష్యం చూపారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. ఏ రాష్ట్రానికి కూడా నిధులు నిరాకరించలేదని చెప్పారు.
న్యూఢిల్లీ: ఈనెల 23న పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ (Union Budget 2024)లో విపక్ష పాలిత రాష్ట్రాలపై నిర్లక్ష్యం చూపారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తోసిపుచ్చారు. ఏ రాష్ట్రానికి కూడా నిధులు నిరాకరించలేదని చెప్పారు. లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు నిర్మలా సీతారామన్ మంగళవారంనాడు సమాధానమిస్తూ, యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా బడ్జె్ట్ ప్రసంగాల్లో అన్ని రాష్ట్రాల పేర్లు ప్రస్తావించలేదన్నారు.
''2004-2005, 2005-2006, 2006-2007, 2007-2008 తదితర బడ్జెట్ ప్రసంగాలను నేను ఉదహరిస్తున్నాను. 2004-05లో 17 రాష్ట్రాల పేర్లు ప్రస్తావనకు రాలేదు. ఆ సమయంలో నేను 17 రాష్ట్రాలకు నిధులు వెళ్లవా అని ప్రశ్నించాను. మరి వాళ్లు నిధులు ఆపేశారా?'' అని సీతారామన్ ప్రశ్నించారు. 2005-06లో 18 రాష్ట్రాల పేర్లు, 2007-08లో 16 రాష్ట్రాల పేర్లు, 2008-09 లో 13 రాష్ట్రాల పేర్లు, 2009-10లో 26 రాష్ట్రాల పేర్లు బడ్జెట్ ప్రసంగంలో చోటుచేసుకోలేదని మంత్రి వివరించారు.
Uttar Pradesh: కఠిన 'లవ్ జిహాద్' బిల్లుకు యోగి సర్కార్ ఆమోదం.. దోషులకు ఇక యావజ్జీవం
నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయించి, ఆ రెండు రాష్ట్రాలకే పెద్దపీట వేశారని, విపక్ష పాలిత రాష్ట్రాల పేర్లు బడ్జెట్‌లో చోటుచేసుకోలేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. వెంటనే నిర్మలా సీతారామన్ ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. బడ్జెట్ ప్రసంగంలో అన్ని రాష్ట్రాల పేర్లు ప్రస్తావించడం సాధ్యం కాదని, పేర్లు ప్రకటించనంత మాత్రన నిధుల కేటాయింపులు, పథకాలు వారికి వర్తించవని కాదని చెప్పారు.
Read More National News and Latest Telugu News
Updated Date - Jul 30 , 2024 | 09:15 PM