ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shooting: పట్టపగలు దారుణం.. మార్నింగ్ వాక్ వెళ్లిన వ్యాపారిపై కాల్పులు, హత్య

ABN, Publish Date - Dec 07 , 2024 | 11:31 AM

దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా కాల్పులు కలకలం రేపుతున్నాయి. షహదారా ప్రాంతంలో శనివారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన 52 ఏళ్ల వ్యాపారిని ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

Delhi Shooting

ఢిల్లీ (Delhi)లోని షహదారా ప్రాంతంలో శనివారం ఉదయం బుల్లెట్ల కాల్పులు (Shooting) చోటుచేసుకున్నాయి. షాహదారా విశ్వాస్ నగర్‌లో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఓ 52 ఏళ్ల వ్యాపారిని బైక్‌పై వెళ్తున్న దుండగులు కాల్చిచంపారు. దాదాపు 9 రౌండ్ల బుల్లెట్లు పేల్చారు. ఆ క్రమంలో అప్రమత్తమైన పలువురు ఆ వ్యక్తిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.


ఇద్దరు దుండగుల కాల్పులు

మృతి చెందిన వ్యాపారి పేరు సునీల్ జైన్ (52). యమునా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నుంచి మార్నింగ్‌ వాక్‌ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. సీసీటీవీ ద్వారా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బైక్‌పై వెళ్తున్న దుండగులు సునీల్‌ను లక్ష్యంగా చేసుకుని దాదాపు 9 రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటన ఎందుకు జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. కాల్పుల ఘటన నేపథ్యంలో ఆయా పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది.


జంగిల్ రాజ్‌

ఇప్పుడు షహదారాలో కాల్పులపై రాజకీయాలు కూడా వినిపిస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ విషయంలో భారతీయ జనతా పార్టీపై ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి విరుచుకుపడింది. ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, 'అమిత్ షా ఢిల్లీని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీని జంగిల్ రాజ్‌గా మార్చారని ఎద్దేవా చేశారు. ఇలాంటి ఘటనల వల్ల చుట్టుపక్కల ప్రజలు భయానక జీవితం గడుపుతున్నట్లు తెలిపారు. బీజేపీ ఢిల్లీలో శాంతిభద్రతలను కాపాడటం లేదని, ఢిల్లీ ప్రజలు ఏకమై తమ గళాన్ని వినిపించాలని కోరారు. ఫిబ్రవరి 2025లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశ రాజధానిలో పెరుగుతున్న నేరాలు ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు ఇతర పార్టీలకు కూడా కీలకం కానున్నాయి.


కక్షలు ఉన్నాయా

ఉదయం 8:36 గంటలకు బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు ఓ వ్యక్తిని కాల్చివేశారని మాకు పీసీఆర్ కాల్ వచ్చిందని షహదారా డీసీపీ ప్రశాంత్ గౌతమ్ తెలిపారు. వారు 3 నుంచి 4 సార్లు కాల్చివేశారని పేర్కొన్నారు. సునీల్ జైన్ ఒక క్రాకరీ షాప్ యజమాని. ఆయనకు ఎలాంటి బెదిరింపులు లేవని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన ఫార్ష్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వాస్ నగర్‌లో జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే హత్య చేసిన వారు పాత కక్షల కారణంగా చేశారా ఇంకేదైనా కారణం ఉందా అనేది తేలాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు

Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..


Read More National News and Latest Telugu News

Updated Date - Dec 07 , 2024 | 11:48 AM