ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Vidyalaxmi: మధ్యతరగతి విద్యార్థులకు శుభవార్త.. పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్రం ఆమోదం

ABN, Publish Date - Nov 06 , 2024 | 04:33 PM

ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసేందుకు 'పీఎం విద్యాలక్ష్మి' పథకానికి కేంద్ర క్యాబినెట్ బుధవారంనాడు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో చేరాలనే ఆసక్తి ఉన్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల వారి తమ కలలను సాకారం చేసుకోలేకపోతున్న మధ్య తరగతి విద్యార్థులకు (middle-class students) కేంద్రం చల్లటి కబురు చెప్పింది. ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసేందుకు 'పీఎం విద్యాలక్ష్మి' (PM Vidyalaxmi) పథకానికి కేంద్ర క్యాబినెట్ బుధవారంనాడు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Jammu and Kashmir: 370 అధికరణ పునరుద్ధరణపై అసెంబ్లీలో తీర్మానం ఆమోదం


పీఎం విద్యాలక్ష్మి పథకం కింద ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన వారు ఆయా సంస్థల్లో చదువుకునేందుకు 'విద్యా లక్ష్మి పథకం' ద్వారా రుణాలు పొందవచ్చు. ఈ రుణాలకు కొలేటరల్, గ్యారంటర్ అవసరం లేదని క్యాబినెట్ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా 860 ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్రం హామీతో రూ.7.50 లక్షల వరకూ రుణం పొందవచ్చు. రుణంలో 75 శాతం బ్యాంకులకు కేంద్రం గ్యారెంటీ ఇస్తుంది.


ఈ పథకం కింద ఏటా గరిష్టంగా 22 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారని కేంద్ర మంత్రి చెప్పారు. వార్షిక కుటుంబ ఆదాయం రూ.8 లక్షల వరకూ ఉన్నవారికి ఈ పథకం వర్తింపజేయనున్నారు. రూ.10 లక్షల వరకూ 3 శాత వడ్డీ రాయితీ కల్పించనున్నారు. పీఎం వద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా విద్యార్థులు నేరుగా రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి ఉన్నత విద్యతకు దూరం కాకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.


ఇవి కూడా చదవండి

PM Modi: నా బెస్ట్ ఫ్రెండ్‌కు విషెస్..మోదీ ట్వీట్

Chief Minister: సీఎం సిద్దరామయ్య ఆసక్తికర కామెంట్స్.. 40 ఏళ్లకిందటే మంత్రిగా పనిచేశా

For More National and telugu News

Updated Date - Nov 06 , 2024 | 04:34 PM