Convoy Collision: సీఎం కాన్వాయ్‌ని ఢీకొట్టిన కారు.. గాయపడిన వారితోపాటు సీఎం
ABN, Publish Date - Dec 11 , 2024 | 05:12 PM
రాంగ్ సైడ్ నుంచి వస్తున్న కారు సీఎం భజన్ లాల్ కాన్వాయ్‌లోని ఓ కారును ఢీకొట్టింది. జైపూర్‌లోని జగత్‌పురా ఎన్‌ఆర్‌ఐ సర్కిల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
రాజస్థాన్ (Rajasthan) జైపూర్‌లో ఏకంగా ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ కాన్వాయ్‌లో ఉన్న వాహానాన్ని ఓ కారు (Convoy collision) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కాన్వాయ్‌లో ఉన్న భద్రతా సిబ్బందితో సహా 9 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో సీఎం భజన్ లాల్ స్వయంగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ క్రమంలో ఢీకొన్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు.
ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతుండగా జైపూర్‌లోని ఎన్‌ఆర్‌ఐ సర్కిల్ సమీపంలో సీఎం కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత కాన్వాయ్ వాహనం రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి తెలిపారు.
క్షతగాత్రులను సీఎం తన కారులో
ఈ ప్రమాదం జరిగిన వేంటనే సీఎం తన కారును ఆపి వెంటనే తన వాహనంలో క్షతగాత్రులను మహాత్మాగాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ యథావిధిగా కదులుతున్నదని, ట్రాఫిక్ నిలిచిపోలేదని పేర్కొన్నారు. ట్రాఫిక్ మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ వచ్చే వరకు వేచి ఉండకుండా తన సొంత వాహనంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లడం మంచిదని సీఎం భావించారు.
కారణమిదేనా..
జైపూర్‌లోని జగత్‌పురా ఎన్‌ఆర్‌ఐ సర్కిల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా రాంగ్ సైడ్ నుంచి వస్తున్న కారు కాన్వాయ్ ముందు ఢీకొట్టింది. ఢీకొనడంతో రాంగ్ సైడ్ నుంచి వస్తున్న వాహనం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఏడుగురు పోలీసులతో సహా 9 మంది గాయపడ్డారు. వాస్తవానికి సీఎం భజన్ లాల్ స్వయంగా రూట్ లైన్ తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో సామాన్యులెవరూ ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొలేదు.
సీఎం భజన్‌లాల్ స్వయంగా
కాన్వాయ్ రాంగ్ సైడ్ నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో సీఎం భజన్‌లాల్ కారు దిగి ప్రమాదంలో గాయపడిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో కాన్వాయ్‌లో ఉన్న ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. ఢీకొన్న వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన పోలీసులను సీఎం భజన్‌లాల్ స్వయంగా తన వెంట తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదం అనంతరం పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కాన్వాయ్ వాహనాన్ని ఢీకొన్న కారును స్వాధీనం చేసుకున్నారు.
ట్రాఫిక్ ఆపవద్దని
ఈ కారు డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. ఎక్కడ పొరపాటు జరిగిందో ఆరా తీస్తున్నారు పోలీసులు. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం సీఎం కాన్వాయ్ వెళుతుండగా ట్రాఫిక్‌ను ఆపవద్దని సీఎం భజన్‌లాల్ స్పష్టం చేశారు. అందుకే ట్రాఫిక్ నిరాటంకంగా కదులుతోంది. ఇంతలోనే సీఎం కాన్వాయ్ దాటిపోవడంతో రాంగ్ సైడ్ నుంచి వచ్చిన కారు కాన్వాయ్‌లో ఓ ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది.
ఇవి కూడా చదవండి:
Free Government Schemes: ఉచిత పథకాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్థిక శాఖ.. కారణమిదే..
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Bima Sakhi Yojana 2024: మహిళలకు మంచి ఛాన్స్.. బీమా సఖీ యోజనతో రూ. 48 వేలు సంపాదించే అవకాశం..
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Read More Business News and Latest Telugu News
Updated Date - Dec 11 , 2024 | 05:24 PM