Kolkata: సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
ABN, Publish Date - Sep 11 , 2024 | 04:16 PM
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్‌ను కించపరిచేలా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేశారనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్ సమీపంలోని ఫుల్బరీకి చెందిన సుజిత్ హల్దార్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు.
కోల్‌కతా, సెప్టెంబర్ 11: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్‌ను కించపరిచేలా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేశారనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్ సమీపంలోని ఫుల్బరీకి చెందిన సుజిత్ హల్దార్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. ప్రధాన న్యాయమూర్తిని అగౌరవ పరచాలని అతడు ఉద్దేశ్య పూర్వకంగా ఈ విధంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు.
Himachal Pradesh: జూనియర్‌ని ర్యాగింగ్ చేసిన సీనియర్లు అరెస్ట్
అలాగే సుప్రీంకోర్టు గౌరవాన్ని సైతం సుజిత్ కించ పరిచేలా సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నాడన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ఫేక్ వార్తలను షేర్ చేయవద్దంటూ ఈ సందర్బంగా ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా కృష్ణనగర్ పోలీసులు స్పష్టం చేశారు. ఇటీవల.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌లా ఓ వ్యక్తి తనను తాను పరిచయం చేసుకుంటూ క్యాబ్ ఛార్జీల కోసం సోషల్ మీడియాలో నగదు అడిగిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన స్క్రీన్ గ్రాబ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏం జరిగిందంటే..
హాల్లో.. నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని. తాను అత్యవసరంగా కోలిజియం సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. కానీ కన్నాట్ ప్లేస్‌లో చిక్కుకుపోయాను. క్యాబ్‌లో వెళ్లేందుకు తనకు రూ. 500 పంపండి. కోర్టుకు చేరుకోగానే.. ఆ నగదు తిరిగి పంపిస్తానంటూ స్పష్టం చేశారు.
ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఈ నోట్ చూసి సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. వై. చంద్రచూడ్ సైతం అవాక్కైన సంగతి తెలిసిందే.
మరోవైపు..
పశ్చిమ బెంగాల్‌లో వైద్య శాఖలో సీజేఐ చంద్రచూడ్ భార్య లాబియింగ్ చేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వివరణ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యక్తిగత వైద్యులకు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భార్యకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలి హత్యాచార ఘటనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సభ్యుడికి సంబంధముందంటూ ఎక్స్ వేదికగా ఓ ప్రచారం అయితే వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ పై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశామని.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వెల్లడించారు.
అలాగే ముఖ్యమంత్రి మేనల్లుడుతో సీజేఐతోపాటు ఆయన కుటుంబం విదేశాలకు వెళ్లిందంటూ జరుగుతున్న ప్రచారం పైన సైతం వివరణ ఇచ్చింది. 2016లో సుప్రీంకోర్టులో చేరిన నాటి నుంచి డి వై చంద్రచూడ్ ఏనాడు తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్ల లేదని స్పష్టం చేశారు. ఓ వేళ ప్రధాన న్యాయమూర్తి విదేశాలకు వెళ్లవలసి వచ్చినా.. ఆయన ఒంటిరిగానే వెళ్లారని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పేర్కొన్నారు.
Read More National News and Latest Telugu New
Updated Date - Sep 11 , 2024 | 06:29 PM