National: బిహార్‌లో కుల సమీక‘రణం’!
ABN, Publish Date - May 25 , 2024 | 04:22 AM
సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్ శనివారం జరగనుంది. ఈ దశలో బిహార్‌లోని 8 కీలక పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 86 మంది పోటీలో ఉన్నారు.
8 స్థానాలకు నేడు పోలింగ్.. బరిలో 86 మంది అభ్యర్థులు
పట్నా, మే 24: సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్ శనివారం జరగనుంది. ఈ దశలో బిహార్‌లోని 8 కీలక పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 86 మంది పోటీలో ఉన్నారు. మొత్తం కోటిన్నర మంది ఓటర్లు వీరి భవితవ్యం తేల్చనున్నారు.
ఆరోదశ పోలింగ్ జరనున్న నియోజకవర్గాల్లో వాల్మీకి నగర్, పశ్చిమ చెంపారన్, పూర్బీ చెంపారన్, షోహార్, శివన్, గోపాల్‌గంజ్, మహరాజ్‌గంజ్, వైశాలి ఉన్నాయి. అయితే, ప్రధాన పార్టీలైన జేడీయూ, ఆర్జేడీలు కుల సమీకరణలకు, ఆర్థిక బలానికి ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.
మొత్తం 8 స్థానాల్లో సీఎం నితీశ్ నేతృత్వంలోని జేడీయూ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. వీటిలో గత ఎన్నికల్లో బీజేపీ విజయం దక్కించుకున్న షోహార్ నియోజకవర్గం ఉండడం విశేషం. ఇక్కడ నుంచి రాజపుత్ సామాజిక వర్గానికి చెందిన లవ్లీ ఆనంద్‌కు జేడీయూ టికెట్ ఇచ్చింది. ఇదే స్థానం నుంచి ఆర్జేడీ తరఫున వైశ్య వర్గానికి చెందిన రితుజైశ్వాల్ బరిలో ఉన్నారు.
Updated Date - May 25 , 2024 | 07:09 AM