Excise policy case: కేజ్రీవాల్‌కు మూడు రోజుల సీబీఐ కస్టడీ
ABN, Publish Date - Jun 26 , 2024 | 07:59 PM
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. మూడు రోజుల సీబీఐ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు బుధవారంనాడు ఆదేశించింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఇంతకుముందే కేజ్రీవాల్‌ను అధికారికంగా అరెస్టు చేసింది.
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కేసు (Excise policy case)లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు చుక్కెదురైంది. మూడు రోజుల సీబీఐ (CBI) కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు బుధవారంనాడు ఆదేశించింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఇంతకుముందే కేజ్రీవాల్‌ను అధికారికంగా అరెస్టు చేసింది. ఇంటరాగేషన్ కోసం ఐదు రోజులు ఆయనను తమకు అప్పగించాలని కోర్టును సీబీఐ కోరగా, మూడురోజల కస్టడీకి కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణను జూన్ 29వ తేదీకి వాయిదా వేసింది.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్టుతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేజ్రీవాల్ జైలులోనే ఉన్నారు. లిక్కర్ పాలసీకి సంబంధించి సీబీఐ సోమవారంనాడు జైలులోనే కేజ్రీవాల్‌ను ఇంటరాగేట్ చేసింది. అనంతరం ప్రత్యేక కోర్టు నుంచి ప్రొడక్షన్ వారెంట్‌తో బుధవారంనాడు విచారణ కోర్టు ముందు హాజరుపరిచింది.
బెయిల్ ప్రొసీడింగ్స్...
దీనికిముందు, మార్చి 21న ఈడీ అరెస్టు అనంతరం కేజ్రీవాల్ బెయిల్ కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. జూన్ 20న ఆయనకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టులో ఈడీ సవాలు చేసింది. దీంతో జూన్ 21న బెయిలుపై కోర్టు స్టే ఇస్తూ, జూన్ 25వ తేదీకి తీర్పును వాయిదా వేసింది. దీంతో సుప్రీంకోర్టును కేజ్రీవాల్ లీగల్ టీమ్ ఆశ్రయించింది. దీనిపై అత్యన్నత న్యాయస్థానం తక్షణ ఆదేశాలకు నిరాకరిస్తూ, హైకోర్టు ఆదేశాల కోసం వేచిచూడాల్సిందిగా సూచించింది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించిన నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ ఎక్సైజ్ పాలసీ 2021-22ను 2022 జూలైలో ఉపసంహరించుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jun 26 , 2024 | 07:59 PM