ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Manish Sisodia: సాక్ష్యాలను తారుమారు చేయవచ్చు.. మనీష్ సిసోడియా బెయిల్ పై సీబీఐ కామెంట్స్..

ABN, Publish Date - Apr 20 , 2024 | 01:31 PM

దిల్లీ మద్యం కుంభకోణం ( Delhi Liquor Case ) కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున బెయిల్ ను వ్యతిరేకిస్తున్నట్లు సీబీఐ న్యాయవాది రూస్ అవెన్యూ కోర్టుకు వెల్లడించారు.

దిల్లీ మద్యం కుంభకోణం ( Delhi Liquor Case ) కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున బెయిల్ ను వ్యతిరేకిస్తున్నట్లు సీబీఐ న్యాయవాది రూస్ అవెన్యూ కోర్టుకు వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఈ కేసు తీర్పును న్యాయస్థానం రిజర్వ్‌లో ఉంచింది. ఏప్రిల్ 30న తీర్పు వెలువరించనుంది. దీంతో పాటు మధ్యంతర బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్‌ను సిసోడియా ఉపసంహరించుకున్నారు. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను ఈడీ సైతం వ్యతిరేకించింది. వారంలోగా సమాధానం ఇవ్వాలని కోరుతూ సీబీఐ, ఈడీకి కోర్టు గతంలో నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ పొందాలని సిసోడియా తరపున పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.


Amit Shah: సొంత కారు లేదు.. రూ.15 లక్షల అప్పు ఉంది.. అమిత్ షా ఆస్తుల విలువ ఇవే..

మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 45లోని షరతులను సిసోడియా పాటించడం లేదని ఈడీ పేర్కొంది. నిపుణుల నివేదిక నుంచి తప్పుకున్నట్లు నటించేందుకు సిసోడియా ఈమెయిల్స్‌ పెట్టారని ఆరోపించింది. ఇందుకు సంబంధించి తమ వద్ద డాక్యుమెంటరీ ప్రూఫ్, వాట్సాప్ చాట్, ఈ మెయిల్ సాక్ష్యాలు ఉన్నాయని తెలిపింది. ఏప్రిల్ 6న, ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హుస్సేన్, మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ విచారణ నత్త నడకన సాగుతోందని అన్నారు.


Supreme Court: పిల్లలతో పోర్న్ వీడియోలు చేయడం తీవ్ర నేరమే.. సుప్రీంకోర్టు

ఈ క్రమంలో ఏప్రిల్ 6న కోర్టు మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 18 వరకు పొడిగించింది. ఈ కేసులో విచారణ అనంతరం 2023 మార్చి 9న మనీష్ సిసోడియాను ఈడీ అరెస్టు చేసింది. 2023 ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్ట్ చేయడం గమనార్హం.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 20 , 2024 | 01:31 PM

Advertising
Advertising