Telangana: 6, 9, 11 తరగతులకు ‘నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్’
ABN, Publish Date - Apr 11 , 2024 | 07:43 AM
కొత్త విద్యాసంవత్సరం(2024–25) నుంచి 6, 9, 11 తరగతులకు ‘నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌సీఆర్‌ఎఫ్)’ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ అనుబంధ పాఠశాలలను బుధవారం ఆహ్వానించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: కొత్త విద్యాసంవత్సరం(2024–25) నుంచి 6, 9, 11 తరగతులకు ‘నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌సీఆర్‌ఎఫ్)’ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ అనుబంధ పాఠశాలలను బుధవారం ఆహ్వానించింది. జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీఆర్‌ఎఫ్‌ను ప్రారంభించింది. పాఠశాల విద్య, ఉన్నత విద్య, వృత్తి విద్యలను సమీకృతం చేయడం.. ప్రీ ప్రైమరీ నుంచి పీహెచ్‌డీ స్థాయి వరకు విద్యార్థులు తమ క్రెడిట్లను పెంచుకోవడానికి ఎన్‌సీఆర్‌ఎఫ్ దోహదపడుతుంది.
సీబీఎస్‌ఈ ముసాయిదా ప్రకారం పాఠశాల, ఉన్నత, వృత్తి విద్యలను అభ్యసించే విద్యార్థులకు క్రెడిట్ల కేటాయింపు కోసం సంవత్సరానికి మొత్తం అభ్యసన గంటలను 1200గా నిర్ణయించారు. ఈ ప్రక్రియలో విద్యార్థులకు 40 క్రెడిట్లు ఇస్తారు. అంటే 30 అభ్యసన గంటలు ఒక క్రెడిట్‌తో సమానం. ఈ ముసాయిదా మార్గదర్శకాల అమలును 2024–25 విద్యాసంవత్సరం నుంచి 6, 9, 11 తరగతులకు పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సీబీఎస్‌ఈ నిర్ణయించినట్లు అనుబంధ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు రాసిన లేఖలో తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Apr 11 , 2024 | 07:43 AM