Bandra Stampede: తొక్కిసలాటకు ముందు జరిగిందిదే.. సీసీటీవీ ఫుటేజ్ వెల్లడి
ABN, Publish Date - Oct 28 , 2024 | 04:24 PM
రైల్వే యార్డ్ నుంచి తెల్లవారుజామున 2.44 గంటలకు 22 బోగీల అన్‌రిజర్వ్‌డ్ బాంద్రా-గోరఖ్‌పూర్ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రాగానే ఒక్కసారిగా ప్రయాణికులు రైలుఎక్కేందుకు పోటీపడ్డారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం తలెత్తింది. పండుగ సీజన్లలో ప్రయాణికుల రద్దీ సహజంగానే ఉంటుంది.
ముంబై: బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషన్‌లో ఆదివారంనాడు జరిగిన తొక్కిసలాటలో పది మందికి పైగా గాయపడటం తీవ్ర సంచలనం సృష్టించింది. రైల్వే శాఖ మౌలిక వసతుల కల్పన, భద్రతా ఏర్పాట్ల పైన ఆందోళనలు, విమర్శలు వెల్లువత్తాయి. తొక్కసలాటకు ముందు ఫ్లాట్‌ఫాంపై ఏమి జరిగిందో తెలిపే సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగుచూసింది. అన్‌రిజర్వ్‌డ్ ట్రైను ఫ్లాట్‌ఫాం నుంచి కదలడానికి కొద్ది ముందు ప్రయాణికులు ఒక్కసారిగా రైలు ఎక్కేందుకు పోటీపడటం, ఒకరినొకరు నెట్టుకోవడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి తలెత్తింది.
Death Threat: పప్పూ యాదవ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు
రైల్వే యార్డ్ నుంచి తెల్లవారుజామున 2.44 గంటలకు 22 బోగీల అన్‌రిజర్వ్‌డ్ బాంద్రా-గోరఖ్‌పూర్ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రాగానే ఒక్కసారిగా ప్రయాణికులు రైలుఎక్కేందుకు పోటీపడ్డారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం తలెత్తింది. పండుగ సీజన్లలో ప్రయాణికుల రద్దీ సహజంగానే ఉంటుంది. సీసీటీవీ కెమెరా సెక్యూరిటీ ఫుటేజ్ ప్రకారం, బాంద్రా టెర్మినస్ ఫ్లాట్‌ఫాం నెంబర్ 1 నార్త్ ఎండ్ వద్ద రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ తీవ్ర తోపులాటలో పలువురు ప్రయాణికులు పట్టు తప్పి కిందకు జారారు. రైలు ఇంకా పూర్తిగా ఆగకుండానే ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో పలువురు గుంపులోనే చిక్కుకుపోయారు. రద్దీని నియంత్రించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించినప్పటికీ తగినంతగా సిబ్బంది లేకపోవడంతో పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ప్రయాణికులు పలువురు డ్రమ్‌లు, భారీ లగేజీతో ఎక్కే ప్రయత్నం చేయడంతో మందు వారు వెనక్కి, వెనకి వారు ముందుకు అన్నట్టుగా తోపులాట చోటుచేసుకుంది. అయితే, తొక్కిసలాట విజువల్స్ మాత్రం ఆ ఫుటేజ్‌లో చూపించలేదు.
130కి పైగా ప్రత్యేక రైళ్లు
పండుగ సీజన్లలో వెస్ట్రన్ రైల్వే వివిధ ప్రాంతాలకు 130కి పైగా ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ముఖ్యంగా దీపావళి, ఛాత్ ఫెస్టివల్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్, బీహార్‌కు పలు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఫ్లాట్‌ఫాంపై రద్దీని తగ్గించేందుకు, ప్రయాణికుల రాకపోకల సక్రమ నిర్వహణకు ఫ్లాట్‌ఫాం టికెట్ల అమ్మకాలను నియంత్రిస్తూ ముంబై సెంట్రల్, దాదర్, బాంద్రా టెర్మినస్, బోరివలి, వసై రోడ్డు, వాపి, వల్సద్, ఉడన, సూరత్ స్టేషన్లలో తగిన చర్యలు తీసుకున్నారు. చివరి క్షణంలో కంగారుపడటం కాకుండా బోర్డింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు రైళ్ల షెడ్యూల్ సమయానికి గంట ముందే ప్రయాణికులు స్టేషన్లకు చేరుకోవాలని నార్తర్న్ రైల్వే కోరింది.
ఇవి కూడా చదవండి...
టాటా-ఎయిర్‌బస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
INDIA Alliance: కాంగ్రెస్-లెఫ్ట్ మధ్య సీట్ల చిచ్చు!
Read More National News and Latest Telugu News
Updated Date - Oct 28 , 2024 | 04:24 PM