ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Cabinet Meeting: ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ మీటింగ్

ABN, Publish Date - Jun 10 , 2024 | 06:59 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో ముచ్చటగా మూడోసారి ‘మోదీ 3.0 ప్రభుత్వం’ కొలువుదీరింది. మూడవ సారి ప్రమాణ స్వీకారం చేసిన రెండవ ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ మూడు సార్లు ప్రధానిగా చేసిన రికార్డ్ కేవలం జవహర్‌లాల్ నెహ్రూదే. ఇప్పుడు మోదీ ఆ రికార్డును సమం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోదీతో పాటు మంత్రి మండలిని ప్రమాణ స్వీకారం చేయించారు. మోదీతో పాటు మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో ముచ్చటగా మూడోసారి ‘మోదీ 3.0 ప్రభుత్వం’ కొలువుదీరింది. మూడవ సారి ప్రమాణ స్వీకారం చేసిన రెండవ ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ మూడు సార్లు ప్రధానిగా చేసిన రికార్డ్ కేవలం జవహర్‌లాల్ నెహ్రూదే. ఇప్పుడు మోదీ ఆ రికార్డును సమం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోదీతో పాటు మంత్రి మండలిని ప్రమాణ స్వీకారం చేయించారు. మోదీతో పాటు మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. మోదీ 3.0 ప్రభుత్వంలో 30 మంది కేబినెట్ మంత్రులు, 5 మంది స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరి పోర్ట్‌ఫోలియోలను తర్వాత ప్రకటించనున్నారు.ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది.

తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు..

తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఐదుగురు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్‌లు ప్రమాణం చేశారు.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 06:59 AM

Advertising
Advertising