ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata: కేంద్ర బలగాల అధీనంలోకి ఆర్జీ కర్‌!

ABN, Publish Date - Aug 22 , 2024 | 05:23 AM

కోల్‌కతాలోని ఆర్జీకర్‌ వైద్య కళాశాల, ఆస్పత్రిని కేంద్రబలగాలు తమ అధీనంలోకి తీసుకోనున్నాయి.

  • వైద్య కళాశాల వద్దకు సీఐఎ్‌సఎఫ్‌ బృందం.. సీబీఐ అధికారుల ఎదుటకు ఆరోసారి మాజీ ప్రిన్సిపాల్‌

  • ఆస్పత్రిలో విధ్వంసం ఘటనలో ముగ్గురు ఉన్నతాధికారులపై మమత సర్కారు వేటు

కోల్‌కతా, ఆగస్టు 21: కోల్‌కతాలోని ఆర్జీకర్‌ వైద్య కళాశాల, ఆస్పత్రిని కేంద్రబలగాలు తమ అధీనంలోకి తీసుకోనున్నాయి. విమానాశ్రయాలు, పార్లమెంటు వద్ద భద్రతను పర్యవేక్షించే సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎ్‌సఎఫ్‌) బలగాల బృందం బుధవారం ఉదయం ఆస్పత్రిని సందర్శించింది. అక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది. అనంతరం ఆస్పత్రి అధికారులు, పోలీసులతో సీఐఎ్‌సఎ్‌ఫకు చెందిన సీనియర్‌ అధికారి ప్రతా్‌పసింగ్‌ మాట్లాడారు.


ఆయన్ను మీడియా ప్రశ్నించగా.. ‘మాకు అప్పగించిన పని కోసం మేం ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని మా పని చేసుకోనివ్వండి. ఆ తర్వాత దీనిపై మీతో ఉన్నతాధికారులు మాట్లాడతారు’ అని చెప్పారు. హత్యాచార కేసుసు సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. ఆగస్టు 14 అర్ధరాత్రి తర్వాత ఆర్జీకర్‌ ఆస్పత్రిలో దుండగులు చొచ్చుకెళ్లి పెను విధ్వంసం సృష్టిస్తే కోల్‌కతా పోలీసులు ఏం చేస్తున్నట్లు? అని నిలదీసిన నేపథ్యంలో ఆస్పత్రి భద్రత ఏర్పాట్లను కేంద్రబలగాలు పరిశీలించడం గమనార్హం.


ఇక ఆస్పత్రిలో గూండాల విఽధ్వంసంపై సుప్రీంకోర్టు నిలదీయడంతో బెంగాల్‌ సర్కారు వెంటనే చర్యలకు దిగింది. ఆస్పత్రిలో విధ్వంస ఘటనకు సంబంధించి ఇద్దరు ఏసీపీలు సహా ముగ్గురు ఉన్నతాధికారులను సస్పెండ్‌ చేసింది. ఆర్జీకర్‌ వైద్యకళాశాలకు చెందిన వివాదాస్పద మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ బుధవారం మరోసారి సీబీఐ కార్యాలాయానికి వెళ్లారు. హత్యాచార ఘటనకు సంబంధించి సీబీఐ ఆయన్ను విచారించడం ఇది ఆరోసారి.


ఐదుసార్లు విచారణలో భాగంగా ఆయన్ను సీబీఐ అధికారులు 64 గంటలపాటు ప్రశ్నించారు. ఆస్పత్రుల్లో వైద్యులకు భద్రత కల్పించాలనే డిమాండ్‌తో వరుసగా పదోరోజూ ఢిల్లీలోని రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఆర్డీయే) ఆందోళనలు నిర్వహించింది. కాగా, సందీప్‌ ఘోష్‌కు సీబీఐ పాలీగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించనుంది. ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం వ్యవహారంలో ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఆయనను సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

Updated Date - Aug 22 , 2024 | 05:23 AM

Advertising
Advertising
<