Central Government : కోటి ఇళ్లకు సౌర విద్యుత్ వెలుగులు
ABN, Publish Date - Jul 24 , 2024 | 05:44 AM
పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ పథకం కింద ఒక కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ పథకం కింద ఒక కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. మరోపక్క, అణువిద్యుత్ రంగంలో తొలిసారి ప్రైవేటు పెట్టుబడులకు ఆహ్వానం పలికింది. చిన్నపాటి అణు విద్యుత్ రియాక్టర్ల(ఎ్‌సఎంఆర్) ఏర్పాటు, అభివృద్ధి అంశంలో ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యం కానుంది. పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తామని ప్రకటించింది.
Updated Date - Jul 24 , 2024 | 05:44 AM